ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా ప్రదర్శించాలి - శేఖర్ కమ్ముల
ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా ప్రదర్శించాలి - శేఖర్ కమ్ముల
Published Thu, Sep 12 2013 12:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM
‘‘ఇలాంటి కథతో సినిమా చేసిన అయోధ్యగారికి కంగ్రాట్స్. నేను ఆయనంత ధైర్యం చేయలేను. ఇంతమంది పిల్లలకు శిక్షణ ఇచ్చి చేయించడమనేది చాలా రిస్క్. ప్రతి స్కూల్లోనూ ఈ సినిమా వేసి చూపించాలి’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల చెప్పారు. రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకంపై అయోధ్య కుమార్ కృష్ణంశెట్టి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘మిణుగురులు’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు పాటల సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డికి అందించారు. ఈ సందర్భంగా అయోధ్య కుమార్ మాట్లాడుతూ -‘‘40 మంది అంధులైన బాలలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేశారు’’ అనితెలిపారు. తారే జమీన్ పర్, బర్ఫీ తరహాలో ఇదో విభిన్న చిత్రమని నటుడు దీపక్ చెప్పారు.
ప్రభుత్వం తరపున ఈ చిత్రానికి సబ్సిడీ రావడానికి తన వంతు ప్రయత్నిస్తానని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇంకా సంగీత దర్శకుడు జోస్యభట్ల, మంచు లక్ష్మీ, సునీల్ కుమార్‌రెడ్డి, కాసు ప్రసాద్‌రెడ్డి, వంశీకృష్ణ, సన, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు.
Advertisement