వాళ్ల కౌగిలింతలు మిస్సవుతున్నా! | missing them and their hugs, tweets shah rukh khan | Sakshi
Sakshi News home page

వాళ్ల కౌగిలింతలు మిస్సవుతున్నా!

Published Mon, Apr 18 2016 12:28 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

వాళ్ల కౌగిలింతలు మిస్సవుతున్నా!

వాళ్ల కౌగిలింతలు మిస్సవుతున్నా!

ఫ్యాన్ సినిమా సూపర్‌హిట్ కావడంతో మంచి ఉత్సాహంగా ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రస్తుతం షూటింగులకు కాస్తంత విరామం ఇచ్చి కుటుంబంతో గడుపుతున్నాడు. అయితే, ఇదే సమయంలో ఎవరినో మిస్సవుతున్నానని, వాళ్ల కౌగిలింతలు కూడా మిస్సవుతున్నానని కాస్తంత వాపోతున్నాడు. వాళ్లెవరన్న విషయాన్ని షారుక్ స్పష్టంగా చెప్పకపోయినా.. తన సినిమాలో నటించే హీరోయిన్లు అయి ఉంటారని అభిమానులు అంటున్నారు.

హీరోయిన్లను, షూటింగులో వాళ్లిచ్చే కౌగిలింతలను మిస్సవుతున్నట్లుగా షారుక్ ట్వీట్ చేశాడని చెబుతున్నారు. ఇంతకీ షారుక్ తన ట్వీట్‌లో ఏం చెప్పాడో తెలుసా... ''చాలా రోజుల తర్వాత నా పిల్లలతో కలిసి కూర్చుని.. అలా టీవీ చూస్తున్నా, సంగీతం వింటున్నా. ఇంత ఆనందకరమైన సెలవు రోజున చాటింగ్ కూడా చేస్తున్నా. ఇలాంటి సెలవు కావాల్సిందే. అయితే వాళ్లను, వాళ్ల కౌగిలింతలను మాత్రం మిస్సవుతున్నా'' అని చెప్పాడు. ఇంతకీ మరి ఆ విషయం ఏమిటో గౌరీఖాన్ చూసుకోవాల్సిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement