
స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కే చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. తెలుగులో క్రీడా నేపథ్యంతో వచ్చే చిత్రాల సంఖ్య తక్కువే కానీ.. ఇక్కడా అలాంటి చిత్రాలు విజయవంతమయ్యాయి. తాజాగా నాని హీరోగా వచ్చిన జెర్సీ చిత్రంలో మంచి విజయాన్ని నమోదుచేసింద. త్వరలో మళ్లీ క్రికెట్ నేపథ్యంలో కౌసల్య కృష్ణమూర్తి అనే చిత్రం రాబోతోంది.
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా టీజర్‌ను విడుదల చేయించింది చిత్రబృందం. ఈ టీజర్‌తో మూవీపై అంచనాలు పెరిగాయి. తమిళ సూపర్‌హిట్ మూవీ కణా చిత్రానికి రీమేక్‌గా వస్తోన్న ఈ చిత్రంలో శివకార్తీకేయన్ ఓ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్యా రాజేష్, రాజేంద్ర ప్రసాద్‌లు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌కు భారత మహిళా జట్టు వన్డే కెప్టెన్ మిథాలీరాజ్, రాశీఖన్నా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. జూలై 2న అడియో రిలీజ్‌ను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్నారు.