
మౌని రాయ్ టీవీ నటి. సినీ నటి. గాయని. కథక్ డాన్సర్. మోడల్. వయసు 34. పద్నాలుగేళ్ల క్రితం టీవీలోకి వచ్చారు. మొన్నటి బిగ్ బాస్ 13 లో గెస్ట్ గా కూడా ఉన్నారు. మధ్యలో ఎనిమిది బాలీవుడ్ సినిమాలు చేశారు. మరో రెండు సినిమాలు చేతిలో ఉన్నాయి. ఈ అచీవ్‌మెంట్స్ అన్నిటినీ వదిలేది, ఫ్యాన్స్ ఆమెను పెళ్లెప్పుడు, పెళ్లెప్పుడు అని అడుగుతున్నారు. అలా అడుగుతున్న వాళ్లలో ఇంట్లో వాళ్లు కూడా ఉన్నారు. ‘పెళ్లెప్పుడు?’ అనే ఈ ప్రశ్నకు బాగా విసిగి పోయారు మౌని రాయ్. జూన్ 2 న ‘పింక్ విల్లా’ వెబ్ సైట్ ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్న వచ్చింది. ‘ఆరోజు వస్తే ఇంటి పైకప్పు ఎక్కి ప్రపంచానికి వినిపించేలా పెద్దగా అరచి చెప్తాను సరేనా..’ అని అన్నారు మౌని.(నాలుగు జతల బట్టలతో ఉంటున్నా: నటి)
Comments
Please login to add a commentAdd a comment