
Mouni Roy Getting Marriage To Boy Friend Suraj Nambiar: ప్రముఖ టీవీ నటి, నాగిని సీరియల్ ఫేం మౌనీ రాయ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది. తన ప్రియుడు, దుబాయ్ వ్యాపావేత్త అయిన సురజ్ నంబియార్‌ను వచ్చే ఏడాది జనవరిలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల మౌనీ తల్లి ఈ ఏడాది ప్రారంభం సూరజ్ తల్లిదండ్రులను తన స్నేహితురాలైన నటి మందిరా బేడీ ఇంట్లో కలిసి వారి పెళ్లి విషయంపై చర్చించారట. దీంతో వచ్చే ఏడాది జనవరిలో వివాహ ముహుర్తం ఖారారు చేసిన్లట్లు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సూరజ్ దుబాయ్‌కి చెందిన ఓ బ్యాంకర్, వ్యాపారవేత్త. అతడు బెంగళూరుకు చెందిన జైన్ కుటుంబానికి చెందిన వాడు.
చదవండి: ఆస్పత్రి పాలైన నటి.. త్వరగా కోలుకోవాలంటూ మాజీ భర్త పోస్ట్
తన చిరకాల స్నేహితుడైన సూరజ్‌తో మౌనీ రాయ్ కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటం, లాక్‌డౌన్‌లో కాలంలో ఆమె అక్కడే ఉండటంతో సూరజ్‌ను పెళ్లి చేసుకున్నట్లు గతంలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ రూమార్స్‌పై స్పందించిన ఆమె ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో పుకార్లకు ఫుల్‌స్టాం పడింది. ఈ క్రమంలో మరోసారి ఆమె పెళ్లి విషయం తెరపైకి వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 2022లో సూరజ్‌ను పెళ్లి చేసుకోబోతుందని, వారి వివాహ వేడుకు దుబాయ్ లేదా ఇటలీ జరగనుందని మౌనీ కజిన్ విద్యుత్ రాయ్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన స్థానిక మీడియాకు తెలిపాడు. కాగా మౌనీ రాయ్ స్వస్థలం పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బెహార్.
చదవండి: మౌనీ రాయ్ జన్యున్ కాదు.. ఆమెని ఎప్పటికీ క్షమించను: నటుడు
ఈ నేపథ్యంలో మౌనీ కజిన్ విద్యుత్ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మౌనీ, సూరజ్‌ను జనవరి 2022లో పెళ్లి చేసుకోబోతుందని, వారి వివాహ వేడుక దుబాయ్‌లో లేదా ఇటలీ జరగనుంది. నేను నా కుటుంబం కూడా వారి వివాహనికి హజరవుతున్నాం. అనంతరం ఇండియాకు వచ్చాక మౌనీ స్వస్థలమైన కూచ్ బెహార్‌లో కూడా సన్నిహితులు, బంధువుల కోసం ప్రత్యేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక మౌనీ సినిమాల విషయాల వస్తే.. ఆమె చివరిగా ‘లండన్ కాన్ఫిడెన్షియల్’ అనే చిత్రంలో కనిపించింది. ఈ మూవీ సెప్టెంబర్ 2020లో ఓటీటీ సంస్థ జీ5లో విడుదలైంది. ఇక తాజాగా ఆమె నటించిన ‘బ్రహ్మస్త్ర’ విడుదలకు సిద్దమవుతోంది. రణ్‌బిర్ కపూర్, అలియా భట్‌కు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, డింపుల్ కాపాడియాలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున అక్కినేని కూడా కీలక పాత్రలో పోషించాడు.
Comments
Please login to add a commentAdd a comment