హీరోయిన్‌కు విడాకులు మంజూరు | Mumbai Family court grants divorce to Karisma Kapoor and Sunjay Kapur | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌కు విడాకులు మంజూరు

Published Mon, Jun 13 2016 8:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

హీరోయిన్‌కు విడాకులు మంజూరు

హీరోయిన్‌కు విడాకులు మంజూరు

ముంబయి: బాలీవుడ్ లో ఓ జంట విడిపోయింది. ప్రముఖ బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ ఆమె భర్త సంజయ్ కపూర్ విడిపోయారు. సోమవారం ముంబయి ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దీంతో వారిద్దరు చట్టబద్దంగా విడిపోయారు. 2003లో వివాహం చేసుకున్న ఈ జంట గత రెండేళ్ల కిందటే పలుమార్లు ఘర్షణలు పడిన విషయం తెలిసిందే.

తామిద్దరం ఇక కలిసి ఉండటం ఏమాత్రం సాధ్యం కాదన్న నిర్ణయం మేరకు 2014లో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి నుంచి పలు మలుపులు తీసుకున్న ఈ వివాదం చివరకు సోమవారం ఓ కొలిక్కి వచ్చింది. వీరికి సమైరా, కియాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉండగా వారి సంరక్షణ బాధ్యతలు కరిష్మా చూసుకోనుంది. రెండు వీకెండ్లలో మాత్రం సంజయ్ కపూర్ వద్దకు వెళ్లే అవకాశం ఉంటుంది. కరిష్మా కపూర్ మరో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ వాళ్ల సోదరి అనే విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement