పాట పరిచయం! | Musskan Sethi turns singer for Ragala 24 Gantalo | Sakshi
Sakshi News home page

పాట పరిచయం!

Published Fri, Oct 4 2019 2:39 AM | Last Updated on Fri, Oct 4 2019 2:39 AM

Musskan Sethi turns singer for Ragala 24 Gantalo - Sakshi

‘పైసా వసూల్‌’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు స్క్రీన్‌కు పరిచయం అయ్యారు ముస్కాన్‌ సేతి. రెండో సినిమాలో తన యాక్టింగ్‌తో పాటు మరో కొత్త టాలెంట్‌ను పరిచయం చేయబోతున్నారు. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ సినిమాలో ముస్కాన్‌ ఓ కీలక పాత్రలో చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ముస్కాన్‌ గాయనిగా మారారు.

ఇందులో  ‘ఆకాశం..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను ముస్కాన్‌ ఆలపించారు. ఈ విషయం గురించి ముస్కాన్‌ మాట్లాడుతూ – ‘‘రాగల 24 గంటల్లో’ సినిమాలో నేను మోడల్‌గా కనిపిస్తాను. నా వాయిస్‌ బావుందని వాయిస్‌ టెస్ట్‌ చేశారు దర్శకుడు. బావుండటంతో నాతోనే పాడించారు. ఈ మెలోడీ పాట నా పాత్ర పరిచయ గీతం  అవడం సంతోషంగా ఉంది. పాట పాడటాన్ని ఎంజాయ్‌ చేస్తాను కానీ రెండో సినిమాలోనే సింగర్‌గా మారతానని ఊహించలేదు’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement