'ముగ్గురి కళ్లు అచ్చం నా కళ్లలా ఉంటాయి' | My babies have eyes like mine, says Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

'ముగ్గురి కళ్లు అచ్చం నా కళ్లలా ఉంటాయి'

Published Sun, Mar 13 2016 8:05 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'ముగ్గురి కళ్లు అచ్చం నా కళ్లలా ఉంటాయి' - Sakshi

'ముగ్గురి కళ్లు అచ్చం నా కళ్లలా ఉంటాయి'

తండ్రి అంటే ఎలా ఉండాలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కు తెలుసునని చెప్పవచ్చు. ఆయన తన పిల్లల కోసం ఎదో ఓ పని చేస్తూనే ఉంటాడు. సుహానా, అర్యన్, అబ్రాం లతో తనకు ఉన్న పోలికలను గుర్తించినట్లు ట్వీట్ చేశాడు. వారి ముగ్గురి కళ్లు, తన కళ్లు ఒకే తీరుగా ఉంటాయని ఓ ఫొటో పెట్టి పోస్ట్ చేశాడు షారుక్. గతంలో, ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ ఒకే రకంగా ఉంటాయంటూ తన పిల్లలపై మరింత ప్రేమను చూపించాడు. షూటింగ్ అయిపోయాక పిల్లలతోనే గడుపుతానని, వారి గురించి పూర్తిగా తనకు తెలుసునని పేర్కొన్నాడు.

సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆయన పిల్లల కోసం టైం కేటాయిస్తారు. కొన్ని రోజుల కిందట చిన్న కొడుకు అబ్రాంతో కలిసి చిన్న ట్రిప్ వెళ్లివచ్చాడు. అక్కడ బీచ్ లో కొడుకును వెహికల్ పై కూర్చుపెట్టుకుని రైడ్ చేస్తున్న ఫొటోలు కూడా అప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేశాయి. పిల్లలకే తాను బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పాడు. 'ఫ్యాన్', గౌరి షిండే డైరెక్షన్ లో అలియా భట్ తో ఓ మూవీలో షారుక్ నటిస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement