సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులపై ఇప్పటికే చాలా మంది పాటలు రాసి, పాడారు. తాను కూడా కరోనా వైరస్ పైన పాట రాసి, పాడానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘కరోనా వైరస్ పైన నేనే రాసి, పాడిన ‘కనిపించని పురుగు’ అనే పాటని రేపు బయట పడేయబోతున్నాను. చేతులు కడుక్కొని వినండి’ అంటూ ట్వీట్ చేశారు. (ఇప్పుడు ఏమి చేయాలి ‘కరోనా’)
కాగా, కరోనాపై పోరాడదామంటూ చిరంజీవి, నాగార్జున సహా టాలీవుడ్ ప్రముఖులు ‘లెటజ్ ఫైట్ కరోనా’ అనే వీడియా సాంగ్‌లో చేశారు. ఈ పాటపైనా వర్మ వ్యంగ్యంగా స్పందించారు. ‘మల్టీస్టార్లు చేసిన మెగా ఎమోషనల్ సాంగ్ మైండ్‌బ్లోయింగ్ ఉంది. కరోనా వైరస్‌కు ఈ పాట చాలా నచ్చేందని బ్యాక్టీరియా వరల్డ్ నుంచి విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. నేను కూడా చేసిన నాన్ ఎమోషనల్ కరోనా సాంగ్‌ను ఏప్రిల్ ఫూల్ రోజున విడుదల చేస్తాను. ఎవరు ఫూల్సో వైరస్ నిర్ణయిస్తుంద’ని వర్మ రెండు రోజుల క్రితం ట్వీట్ చేశారు. (కరోనా: పాట పాడిన చిరంజీవి, నాగ్)
Comments
Please login to add a commentAdd a comment