యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్ | Nagarjuna and Nikhil Multi Starrer Soon | Sakshi
Sakshi News home page

యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్

Published Fri, Dec 30 2016 1:03 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్ - Sakshi

యంగ్ హీరోతో నాగ్ మల్టీ స్టారర్

సీనియర్ హీరోల్లో ప్రయోగాలకు ఎప్పుడూ ముందుండే స్టార్ కింగ్ నాగార్జున. రొమాంటిక్ ఎంటర్టైనర్స్ నుంచి భక్తిరస చిత్రాల వరకు.. ఇప్పటికీ అన్ని రకాల పాత్రల్లో అలరిస్తున్న నాగార్జున, యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో కొన్ని సినిమాలో గెస్ట్ అపియరెన్స్లు ఇచ్చిన ఈ మన్మథుడు.. ఇప్పుడు ఓ సక్సెస్ ఫుల్ యంగ్ హీరోతో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడట.

ప్రస్తుతం టాలీవుడ్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నయంగ్ హీరో నిఖిల్. స్వామిరారా, కార్తీకేయ, ఎక్కడికీపోతావు చిన్నవాడా లాంటి సినిమాలతో డిఫరెంట్ జానర్లో దూసుకుపోతున్న ఈ యువ కథానాయకుడు సీనియర్ స్టార్ నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడట. నిఖిల్ హీరోగా కార్తీకేయ సినిమాను తెరకెక్కించిన చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement