నాగ్ సినిమాలో నిఖిల్, అనుపమా | Nagarjuna Team up with Nikhil and Anupama | Sakshi
Sakshi News home page

నాగ్ సినిమాలో నిఖిల్, అనుపమా

Published Wed, Mar 15 2017 11:28 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ సినిమాలో నిఖిల్, అనుపమా - Sakshi

నాగ్ సినిమాలో నిఖిల్, అనుపమా

ఓం నమో వేంకటేశాయ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న నాగ్, తిరిగి షూటింగ్ మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజుగారి గది 2 షూటింగ్లో పాల్గొంటున్న నాగ్, ఆ తరువాత చేయబోయే సినిమాను కూడా లైన్లో పెట్టాడు. నాగచైతన్య హీరోగా ప్రేమమ్ లాంటి బ్లాక్ బస్టర్ను తెరకెక్కించిన చందూ మొండేటి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమాను రెడీ చేస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది. నాగార్జునతో పాటు నిఖిల్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటి అనుపమా పరమేశ్వరన్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అనుపమ, నిఖిల్కు జోడిగా నటిస్తుండగా, నాగార్జునకు హీరోయిన్ను ఫైనల్ చేయాల్సి ఉంది. రాజుగారి గది 2 షూటింగ్ పూర్తి కాగానే చందూ మొండేటి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నాడు నాగార్జున.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement