భక్తుడితో భగవంతుడి సెల్ఫీ! | nagarjuna new movie Om Namo Venkatesaya | Sakshi

భక్తుడితో భగవంతుడి సెల్ఫీ!

Oct 21 2016 11:41 PM | Updated on Jul 15 2019 9:21 PM

భక్తుడితో భగవంతుడి సెల్ఫీ! - Sakshi

భక్తుడితో భగవంతుడి సెల్ఫీ!

ఏడు కొండల వెంకటేశ్వరుడి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. వెంటనే భక్తుడితో కలసి ఓ సెల్ఫీ దిగాలనుకున్నారు.

ఏడు కొండల వెంకటేశ్వరుడి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. వెంటనే భక్తుడితో కలసి ఓ సెల్ఫీ దిగాలనుకున్నారు. స్వామివారు స్వయంగా అడగడంతో భక్తుడు కూడా సంతోషంగా సెల్ఫీకి పోజిచ్చారు. స్వామివారి శంఖుచక్రాలు, కిరీటం, ఆభరణాలు ఎక్కడ? భక్తుడి నుదుట నామాలు ఏవి? పైగా, ఇద్దరూ కళ్లజోడు పెట్టుకున్నారేంటి? అనుకుంటున్నారా..!! షూటింగ్ పూర్తయింది కదా, మేకప్ తీసేశారు. అక్కినేని నాగార్జున వెంకటేశ్వరుడి భక్తుడు హాథీరామ్ బాబాగా.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన తర్వాత నాగార్జున, సౌరభ్ జైన్‌లు సరదాగా ఓ సెల్ఫీ దిగారు. అదండీ సంగతి! మహాబలేశ్వరంలో షెడ్యూల్ ముగించుకున్న చిత్ర బృందం ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చింది. త్వరలో తాజా షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. వెంకన్న భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement