saurabh jain
-
అలౌకికానందం
వేయి నామాల శ్రీనివాసుడి వైభోగం... నిత్య కళ్యాణం... పచ్చ తోరణం... కనులారా వీక్షించడం తప్ప వర్ణించతరమా? తిరుమలేశుడు కరుణిస్తే... అనుగ్రహిస్తే... వర్ణించ తరమే. అడుగడుగునా ఏడు కొండల్లో ప్రతిధ్వనించే వేంకటేశ్వరడి విశిష్టతలు వర్ణిస్తే.. సాక్షాత్తు స్వామివారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తే... ఎలా ఉంటుంది? ‘ఓం నమో వేంకటేశాయ’ చిత్రంలా ఉంటుంది. ‘అన్నమయ్య’లో శ్రీవారి భక్తుడి గురించి చెప్పిన దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ‘ఓం నమో వేంకటేశాయ’లో హాథీరామ్ బావాజీ భక్తుడి చరిత్రతో పాటు కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో నిత్యం జరిగే కైంకర్యాల వెనుక కథను చెప్పారు. కథేంటి?: దేవుణ్ణి చూడాలనే తపనతో చిన్నప్పుడే దైవాన్వేషణలో ఊరూరు తిరగడం మొదలుపెడతాడు రాజస్థాన్ వాసి రామ (నాగార్జున). అనుభవానంద స్వామి (సాయికుమార్) వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి అతడికి విద్యాబుద్ధులతో పాటు పాచికలు ఆడటం నేర్పిస్తారు. స్వామి దర్శనం కావాలంటే తపస్సు చేయాలని చెబుతారు. రామ తపస్సుకు మెచ్చిన శ్రీ వేంకటేశ్వరస్వామి బాలుడి రూపంలో రామ దగ్గరికి వస్తారు. స్వయంగా శ్రీవారే బాలుడి రూపంలో వచ్చారని గుర్తించని రాము, అతణ్ణి వెళ్లిపొమ్మని ఆగ్రహిస్తాడు. గురువు ద్వారా ఆ బాలుడే ఏడుకొండలవాడని తెలుసుకుని, తిరుమలకు చేరతాడు. అక్కడ స్వామి దర్శనం ఎలా అయింది? రామ నుంచి హథీరామ్ బాబాజీగా ఎలా మారారు? స్వామివారి నిత్య కైంకర్యాలను ఎలా జరిపించారు? స్వామి చేతుల మీదుగా సజీవ సమాధి ఎందుకయ్యారు? అనేది మిగతా చిత్రకథ. విశ్లేషణ: తెరపై సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్లముందు ప్రత్యక్షమైన భావన కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడూ తెరపై కనిపిస్తున్న దృశ్యంలో మమేకమై చూసేలా స్వామివారికి బాలాజీ అనే పేరు ఎలా వచ్చింది? ఆయన ఏడు కొండలపై ఎందుకు వెలిశారు?... ఇలా స్థల పురాణంతో పాటు భక్తులకు తెలియని ఎన్నో విషయాలను కమర్షియల్ హంగులు జోడించి రాఘవేంద్రరావు ఈ సినిమా తీశారు. రచయిత జేకే భారవి, సంగీత దర్శకుడు కీరవాణి, నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి, విజువల్ ఎఫెక్ట్స్ బృందం.. ప్రతి ఒక్కరి నుంచి ఆయనకు పూర్తి మద్దతు లభించింది. తెర వెనుక బృందం పడిన కష్టం ఒకెత్తయితే... తెరపై నటీనటుల అభినయం మరో ఎత్తు. అనుష్క, ప్రగ్యా జైస్వాల్, విమలారామన్, అస్మిత, రావు రమేశ్.. అందరూ చక్కగా నటించారు. కానీ, ప్రేక్షకుల కళ్లన్నీ నాగార్జున, సౌరభ్ జైన్.. పైనే ఉంటాయి. స్వామివారు నిత్య యవ్వనుడు, అంద గాడు. సౌరభ్ జైన్‌ని ఆ పాత్రలో చూడగానే అచ్చంగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. హాథీరామ్ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతు డికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్ జైన్లు జీవించారు. థియేటర్లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది. -
ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్
కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓం నమోవేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరుని భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి సినిమాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఓం నమో వేంకటేశాయపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవటంతో హీరో నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలని ప్రారంభించాడు. వెంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరబ్ జైన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాగ్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు. -
భక్తుడితో భగవంతుడి సెల్ఫీ!
ఏడు కొండల వెంకటేశ్వరుడి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది. వెంటనే భక్తుడితో కలసి ఓ సెల్ఫీ దిగాలనుకున్నారు. స్వామివారు స్వయంగా అడగడంతో భక్తుడు కూడా సంతోషంగా సెల్ఫీకి పోజిచ్చారు. స్వామివారి శంఖుచక్రాలు, కిరీటం, ఆభరణాలు ఎక్కడ? భక్తుడి నుదుట నామాలు ఏవి? పైగా, ఇద్దరూ కళ్లజోడు పెట్టుకున్నారేంటి? అనుకుంటున్నారా..!! షూటింగ్ పూర్తయింది కదా, మేకప్ తీసేశారు. అక్కినేని నాగార్జున వెంకటేశ్వరుడి భక్తుడు హాథీరామ్ బాబాగా.. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. ఇందులో బాలీవుడ్ నటుడు సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసిన తర్వాత నాగార్జున, సౌరభ్ జైన్లు సరదాగా ఓ సెల్ఫీ దిగారు. అదండీ సంగతి! మహాబలేశ్వరంలో షెడ్యూల్ ముగించుకున్న చిత్ర బృందం ఇటీవలే హైదరాబాద్ తిరిగొచ్చింది. త్వరలో తాజా షెడ్యూల్ మొదలవుతుందని సమాచారం. వెంకన్న భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తున్న ఈ చిత్రాన్ని సాయికృపా ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చిన సౌరబ్
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకున్నారు. పలు హిందీ సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్ ఓం నమో వెంకటేషాయలో వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తున్నాడు. సినిమా రిలీజ్ లోపు సౌరబ్ ను తెలుగు ప్రేక్షకులకు అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ టీజర్ లో అతని లుక్ ను మాత్రమే రివీల్ చేశారు. హీరో నాగార్జున ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించని టీజర్ నాగ్ అభిమానులకు నిరాశకలిగించినా.. వెంకటేశ్వరుడిగా సౌరబ్ లుక్ మాత్రం సినిమా మీద అంచనాలను పెంచుతోంది. నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్‌కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది. -
తెలుగు తెరకు కొత్త దేవుడు
అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడి సాయి లాంటి భక్తి రస చిత్రాలను అందించిన నాగార్జున, రాఘవేంద్రరావుల కాంబినేషన్లో మరో భక్తి రస చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని పరమ భక్తుడు హథీరాం బాబా జీవితకథ ఆధారంగా సినిమా రూపొందించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకు నమో వెంకటేషాయ అనే పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సాక్ష్యాత్తు శ్రీనివాసుడితో పాచికలాడిన పరమ భక్తుడు హథీరాం బాబా కథతో సినిమా అంటే ఆ సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర కూడా చాలా సమయం తెర మీద కనిపిస్తోంది. అందుకే ఆ పాత్రలో కనిపించే నటుడి ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిత్రయూనిట్. గతంలో అన్నమయ్య, శ్రీ రామదాసు సినిమాల్లో సుమన్ దేవుడి పాత్రలో కనిపించగా కొత్త సినిమా కోసం ఓ ఉత్తరాది నటుణ్ని తీసుకురావాలని భావిస్తున్నారట. పలు హిందీ సీరియల్స్‌లో శ్రీమహావిష్ణువు, కృష్ణుడు, శ్రీ రాముడి పాత్రల్లో కనిపించిన సౌరభ్ రాజ్ జైన్‌ను నాగార్జున సినిమా కోసం తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు బుల్లి తెర మీదే కనిపించిన సౌరభ్‌కు తొలిసారిగా సినిమా అవకాశం రావటం పై ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. త్వరలో సౌరభ్ క్యారెక్టర్‌పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రానుంది.