ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్ | Nagarjuna starts promotions for Om namovenkatesaya | Sakshi
Sakshi News home page

ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్

Published Thu, Jan 19 2017 2:57 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్ - Sakshi

ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్

కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓం నమోవేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరుని భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి సినిమాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఓం నమో వేంకటేశాయపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవటంతో హీరో నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలని ప్రారంభించాడు. వెంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరబ్ జైన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాగ్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement