OmNamoVenkatesaya
-
ప్రమోషన్ మొదలుపెట్టిన కింగ్
కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఓం నమోవేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున వేంకటేశ్వరుని భక్తుడు హాథీరాం బాబాగా నటిస్తున్నాడు. గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడిసాయి సినిమాలు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ఓం నమో వేంకటేశాయపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమాను ఫిబ్రవరి 10న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రిలీజ్ కు ఎక్కువ సమయం లేకపోవటంతో హీరో నాగార్జున ప్రమోషన్ కార్యక్రమాలని ప్రారంభించాడు. వెంకటేశ్వరస్వామి పాత్రధారి సౌరబ్ జైన్ తో కలిసి దిగిన ఓ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసిన నాగ్, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించాడు. -
భక్తి పారవశ్యంలో...
-
భక్తి పారవశ్యంలో...
ఏడు కొండల వెంకటేశ్వరుని భక్తుడు హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్ బాబాగా భక్తి పారవశ్యంతో వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించే ఫస్ట్ లుక్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మరో అద్భుతమైన కథతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు’’ అన్నారు. వెంకటేశ్వర స్వామిగా సౌరబ్ జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క, కీలక పాత్రల్లో జగపతిబాబు, ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జేకే భారవి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీర వాణి. -
నాగార్జున, కీరవాణితో నాలుగోసారి..
హైదరాబాద్: అన్నమయ్య, రామదాసు, షిర్డీ సాయిబాబా వంటి భక్తిరస ప్రధానమైన చిత్రాలను తీసిన దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు మరో అపూర్వమైన భక్తి చిత్రాన్ని అందించేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాగార్జున, సంగీత దర్శకుడు కీరవాణితో జత కట్టి ‘నమో వెంకటేశయా’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఈ నెల 25న (శనివారం) ముహూర్తం షాట్ తో ఈ చిత్ర షూటింగ్ ను ప్రారంభించబోతున్నట్టు ఆయన ట్విట్టర్ లో తెలిపారు. ‘ఈ రోజే నేను, నాగార్జున, తిరుమల దర్శనం చేసుకుని తిరిగొచ్చా. నాగార్జున, కీరవాణిలతో నా నాలుగో భక్తిరస చిత్రాన్ని ఈ నెల 25న ముహూర్తం షాట్ తో ప్రారంభించబోతున్నాం’ అని తెలిపారు. గడ్డం లేకుండా తొలిసారి.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గడ్డం లేకుండా సాధారణంగా కనిపించరు. కానీ తాజాగా ఆయనే స్వయంగా ట్విట్టర్ లో గడ్డం లేని ఫొటోను పెట్టారు. తాను గడ్డంతో కనిపించడం వెనుక ఉన్న సంప్రదాయాన్ని కూడా ఆయన వెల్లడించారు. ‘జ్యోతి సినిమా అప్పట్నుంచి ప్రతీ సినిమా మొదలు పెట్టినప్పుడు గడ్డం తీసేసి.. షూటింగ్ పూర్తి అయిన రోజునే మళ్ళీ తీస్తాను. అదే సాంప్రదాయాన్ని ఈ సినిమాకి (నమో వెంకటేశాయ) కూడా కొనసాగించాలనుకుంటున్నాను’ అని ట్విట్టర్ లో తెలిపారు.