భక్తి పారవశ్యంలో... | Stamp to be launched on actor Nagarjuna's Birthday | Sakshi
Sakshi News home page

భక్తి పారవశ్యంలో...

Published Sun, Aug 28 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

భక్తి  పారవశ్యంలో...

భక్తి పారవశ్యంలో...

ఏడు కొండల వెంకటేశ్వరుని భక్తుడు హాథీరామ్ బాబాగా అక్కినేని నాగార్జున నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై.లి. పతాకంపై ఏ.మహేశ్ రెడ్డి నిర్మిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా హాథీరామ్ బాబాగా భక్తి పారవశ్యంతో వెంకటేశ్వరుణ్ణి ప్రార్థించే ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 నిర్మాత మాట్లాడుతూ - ‘‘నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘శిరిడీ సాయి’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే.  మరో అద్భుతమైన కథతో, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు’’ అన్నారు. వెంకటేశ్వర స్వామిగా సౌరబ్ జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క, కీలక పాత్రల్లో జగపతిబాబు, ప్రగ్యా జైశ్వాల్, విమలా రామన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: జేకే భారవి, ఛాయాగ్రహణం: ఎస్.గోపాల్ రెడ్డి, సంగీతం: ఎం.ఎం. కీర వాణి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement