ఓ హీరో.. 30 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే ఓకే. కానీ ఓ హీరో.. 60 ఏళ్ల వయసులో రొమాన్స్ చేస్తే వినడానికే ఏదో రకంగా ఉంది కదా! కానీ అలా చేసినా సరే ప్రేక్షకులకు నచ్చింది అంటే అక్కడున్నది నాగార్జున అని అర్థం. ఎందుకంటే పేరుకే నటుడు కానీ రొమాన్స్‌లో మాత్రం కింగ్ అంటారు. తెలుగు హీరోలు ఎంతమందైనా ఉండొచ్చు కానీ వాళ్లందరితో పోలిస్తే నాగ్ స్పెషల్ ఎందుకో తెలుసా?
(ఇదీ చదవండి: మనసు మార్చుకున్న చిరు.. ఇకపై కేవలం!?)
తండ్రి వారసత్వంతో
టాలీవుడ్‌లో అక్కినేని నాగేశ్వరరావు అలియాస్ ఏఎన్నార్‌ది ప్రత్యేక స్థానం. ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగార్జున.. కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇతడి రూపం హీరోగా పనికిరాదని, వాయిస్ అస్సలు బాగోలేదనే విమర్శలు వినిపించాయి. కానీ కొన్ని చిత్రాలకే వాటి గురించి మర్చిపోయి, తన యాక్టింగ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు.
డిఫరెంట్ జానర్స్
చాలామంది హీరోలు.. మాస్ లేదా రొమాన్స్ ఇలా ఏదో ఓ జానర్‌కి పరిమితమైపోతుంటారు. కానీ నాగార్జున మాత్రం డిఫరెంట్. తొలుత 'మజ్ను' లాంటి ట్రాజెడీ సినిమాలు.. ఆ తర్వాత 'గీతాంజలి' లాంటి ప్రేమ కథలు.. కొన్నాళ్లకు 'శివ' లాంటి ట్రెండ్ సెట్టర్ యాక్షన్ మూవీస్.. అనంతరం 'అన్నమయ్య','శ్రీరామదాసు' లాంటి భక్తి చిత్రాలు.. ఇలా అన్ని జానర్స్‌ని నాగ్ చేసినట్లు వేరే ఏ హీరో కూడా ట్రై చేయలేదు.
(ఇదీ చదవండి: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో కొడుకు)
రొమాన్స్ టాప్
చాలామంది హీరోలకు ఒకే వయసొచ్చాక రొమాంటిక్ సీన్స్ చేయడం తగ్గించేస్తారు. కానీ నాగ్ మాత్రం తన ఏజ్ తో సంబంధం లేకుండా రొమాన్స్ చేస్తుంటాడు. అతడి లాస్ట్ మూవీ 'ఘోస్ట్'లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో లిప్ లాక్ సన్నివేశాల్లోనూ యాక్ట్ చేశాడు. దీనిబట్టే నాగ్‌ని అందరూ 'మన్మథుడు' అర్థం చేసుకోవచ్చు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ తన ఫ్లర్టింగ్ స్కిల్స్ అప్పుడప్పుడు చూపిస్తుంటారు.
తండ్రి కొడుకులతో
చాలామంది హీరోలకు దక్కని అదృష్టం.. 'మనం' మూవీతో నాగ్ సాధ్యం చేశాడు. తండ్రి కొడుకులతో కలిసి నటించిన నటుడిగా రికార్డ్ సృష్టించాడు. ఇందులో తండ్రి ఏఎన్నార్, కొడుకులు నాగచైతన్య-అఖిల్ నటించారు. ఈ సినిమా తెలుగులో వచ్చిన బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం. అలానే తండ్రి సినిమాల్లో నటించిన హీరోయిన్లతోనూ సినిమాలు చేసిన ఘనత నాగ్‌కి మాత్రమే సాధ్యమైంది.
(ఇదీ చదవండి: ఆ రూమర్స్‌పై స్పందించిన నాగచైతన్య.. అవన్నీ!)
యూనిక్ రికార్డ్
ఇప్పుడంతా పాన్ ఇండియా అనే గోలగోల చేస్తున్నారు. కానీ అప్పట్లోనే నాగ్ చాలా హిందీ సినిమాల్లో నటించారు. అలానే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మహేశ్ భట్‌తో 'క్రిమినల్', మణిరత్నంతో 'గీతాంజలి' మూవీస్ చేశాడు. ఇందులో అంత స్పెషల్ ఏముందా అనుకోవచ్చు. ఆ ఇద్దరు స్టార్స్ తెలుగులో ఒకే సినిమా చేశారు. ఆ రెండింట్లోనూ నాగ్ హీరో కావడం విశేషం.
హోస్ట్‌గా హిట్
చాలామంది బిగ్ స్క్రీన్ పై హీరోలుగా హిట్ అయినా.. బుల్లితెరపై ఫెయిలయ్యారు. కానీ నాగ్ మాత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు', బిగ్‌బాస్' లాంటి షోలకు హోస్ట్‌గా అదరగొట్టేశాడు. బిగ్ బాస్ మూడో సీజన్ నుంచి ఈ షోకి హోస్టింగ్ చేస్తున్న నాగ్.. త్వరలో ఏడో సీజన్‌లో సరికొత్తగా ఎంటర్‌టైన్ చేసేందుకు రెడీ అయిపోతున్నాడు. ఇతడిలానే చిరు, ఎన్టీఆర్ కూడా బుల్లితెరపై ప్రయత్నించినప్పటికీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. నాగ్ మాత్రం ప్రతి ఇంటికీ చేరువైపోయాడు. ఇలా తెలుగులో ఎన్ని రికార్డులు సాధించిన నాగ్.. మరెన్నో బర్త్‌డేలు జరుపుకోవాలని ఆశిస్తూ 'పుట్టినరోజు శుభాకాంక్షలు'
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?)
Comments
Please login to add a commentAdd a comment