కింగ్ నాగార్జున మరో ఆసక్తికర ప్రయోగానికి రెడీ అవుతున్నారు. మన్మథుడు ఇమేజ్ ఉన్న నాగ్ మధ్యలో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస చిత్రాల్లోనూ ఆకట్టుకున్నారు. అదే సమయంలో అతిథి పాత్రల్లోనూ మెప్పించారు. తాజాగా నానితో కలిసి మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న దేవదాస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమా తరువాత కూడా ప్రయోగాలకే ఓటేస్తున్నారు నాగ్.
చాలా కాలం తరువాత బ్రహ్మాస్త్రతో బాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అదే సమయంలో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ సినిమాలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం దేవదాస్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ధనుష్ దర్శకత్వంలో చేయబోయే సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 600 ఏళ్ల క్రితం జరిగిన కథతో రూపొందనుందని తెలిపారు.
ఈ సినిమాలో నాగ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ముందుగా ఈ పాత్రను రజనీకాంత్‌తో చేయించాలనుకున్న ధనుష్, డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో నాగార్జున సంప్రదించారు. 70 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
Comments
Please login to add a commentAdd a comment