కరోనా భయం వద్దు.. ఈ వీడియో చూడండి | Nagarjuna Share Shilpa Reddy Video Her Experience on CoronaVirus | Sakshi
Sakshi News home page

కరోనాను జయించాలంటే ఈ వీడియో చూడండి: నాగ్‌

Published Thu, Jun 25 2020 2:54 PM | Last Updated on Thu, Jun 25 2020 5:42 PM

Nagarjuna Share Shilpa Reddy Video Her Experience on CoronaVirus - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని టాలీవుడ్‌ అగ్రహీరో నాగార్జున అక్కినేని పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ట్వీట్‌ చేశారు. కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా, దృఢంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన ఆయుధమని వివరించారు. మోడల్‌, న్యూట్రిషనిస్ట్‌‌, ఫ్యాషన్‌ డిజైనర్‌, తన స్నేహితురాలు శిల్పారెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారని వెల్లడించారు. ఈ క్రమంలో కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన తర్వాత, చికిత్స సమయంలో తాము ఎలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నామో వివరిస్తూ శిల్పారెడ్డి ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియోను నాగార్జున తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. అంతేకాకుండా ఆమె చెప్పిన ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా వినండి అంటూ ఫ్యాన్స్‌కు సూచించారు. (సమంత స్నేహితురాలికి కరోనా)

ఇక ఆ వీడియోలో తమకు కరోనా సోకడానికి గల కారణాలను శిల్పారెడ్డి వివరించారు. తనకు, తన భర్తకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదన్నారు.  కాస్త అస్వస్థతకు లోనవ్వడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయిందన్నారు. తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్‌ పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని వివరించారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలిపారు. అదే విధంగా ప్రతిరోజు తప్పక వ్యాయామం చేయాలని. ప్రాణాయామం చేయడం తప్పనిసరి అని తెలిపారు. నటుడు సామ్రాట్‌ సోదరి అయిన శిల్పారెడ్డి టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్‌ సమంతకు మంచి స్నేహితురాలు. అంతేకాకుండా అక్కినేని కుటుంబానికి ఫ్యామిలీ ఫ్రెండ్‌. ఈ క్రమంలో శిల్పారెడ్డికి, ఆమె భర్తకు కరోనా అని తేలడంతో ఆమె అభిమానులతో పాటు అక్కినేని అభిమానులు కూడా కలవరానికి గురయ్యారు. (రాజాసింగ్‌ డ్రైవర్లు, గన్‌మెన్లకు పాజిటివ్‌)

Every day drill that we did to keep our bodies Prepared and enhance immunity .. -1000 mg - C vitamin -40- 50 mg – zinc(For good protection) -One probiotic capsule -Check your D vitamin levels and maintain what a needed - Get some sunlight -Hydrate yourself well -Drink only warm water or room temperature water with some mint leaves or Tulsi With a pinch of turmeric .Helps you wash down your throat frequently. -You can also have warm turmeric shots With two pinches of pepper -Avoid cold beverages and anything with ice Keep your nose and throat clean. -Take steam twice a day Morning after you wake up and before sleeping .Breathe through your nose 20- 25 times, Breathe through your mouth 20-25 times .. -Indulge in some physical activity(Available on YouTube for beginners ) -Spend 10 minutes for breathing exercises (pranayama)Plenty simple ones available on YouTube -Meditate with a guided meditation tape(Best is to start with ISHA KRIYA ( Available on YouTube in different languages) Or CHIT SHAKTHI meditations on YouTube - it is tried and tested by me .. but the choice is yours) - practice SIMHA KRIYA- (you tube) very Simple three-minute process Twice a day which will enhance your lung capacity . -Sanitise your hands regularly and wash them regularly With soap , wear mask , social distancing ( these v all know ) -Eat clean light home-made food Which is easy on the system -Avoid sugary food Completely or as much as you can -Sleep early wake up early -Make sure your body clock is in sync with the sun -It is a good idea to take a flu shot since the weather has changed. I checked with my doctor and he gave us a go ahead to take flu shots to avoid panic even when you get a common cold or cough - (INFLUVAC) Inactivated influenza vaccine by - Abbot India lent -There are different doses for adults and children Its a good idea to get the influenza shot if you have elders at home but again you must consider checking with your family doctor ..Since every case is different.. -There is a natural concoctions that helps prepare u r body * -5 bulbs garlic -7 or 8 cloves -15 Tulsi leaves (OR 20 Basil leaves) -1 Teaspoon Ajwain -5 mint leaves -10 black pepper .boil

A post shared by SHILPA REDDY (@shilpareddy.official) on

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement