ఔను...ప్రేమలో పడ్డాను! | Nagarjuna's younger son Akhil Akkineni is in love | Sakshi
Sakshi News home page

ఔను...ప్రేమలో పడ్డాను!

Published Tue, Jun 28 2016 12:11 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

ఔను...ప్రేమలో పడ్డాను! - Sakshi

ఔను...ప్రేమలో పడ్డాను!

యస్.. మీరు చదివింది నిజమే! అఖిల్ ప్రేమలో పడ్డారట. ‘నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అని ఓ ఆంగ్ల పత్రికకు సూటిగా, సుత్తి లేకుండా అసలు విషయాన్ని చెప్పేశారు అఖిల్. ఈ సిసింద్రీ మనసు దోచింది ఎవరో కాదట.. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫ్రెండేనట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అని ప్రశ్నిస్తే.. పేరు, ఇతర వివరాలు మాత్రం చెప్పనంటున్నారు అఖిల్.
 
  ఎందుకంటే ఆ అమ్మాయి పబ్లిసిటీకి దూరంగా ఉంటుందని చెప్పారు. ఇంతకీ అఖిల్ లవ్‌కి నాగార్జున, అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇచ్చేశారట. ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు.
 
 ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో అఖిల్ చెప్పారట. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అఖిల్ లవ్‌ని నాగ్, అమల ఆమోదించారట. ఈ విషయాన్ని స్వయంగా అఖిలే చెప్పారు. ఆ అమ్మాయి గురించి చిన్న క్లూ మాత్రం దొరికింది. ఆ అమ్మాయి అప్‌కమింగ్ డిజైనర్ అనీ, న్యూయార్క్‌లో చదివిందనీ సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement