family friend
-
ఆ 11 మంది.. 22 మందికి దారి చూపించారు..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది చాలా మంచి కుటుంబం అని, వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఉండేవారని ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్‌నీత్ బత్రా తెలిపారు. అందుకే ఆ 11 మంది కండ్లను దానం చేసేందుకు అంగీకరించామని, దానికి కావాల్సిన అప్రూవల్ లెటర్ కూడా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 1st thing we did was to donate their eyes that could provide eyesight to 22 people, considering the family was religious & always wanted to help others. We gave approval letter yesterday: Navneet Batra,Friend of the family whose 11 members were found dead in #Delhi's Burari y'day pic.twitter.com/0s14vEsI0n — ANI (@ANI) 2 July 2018 -
దొంగగా మారిన ఫ్యామిలీ ఫ్రెండ్
-
దొంగగా మారిన ఫ్యామిలీ ఫ్రెండ్
ఒకటి కాదు, రెండు కాదు.. 17 ఏళ్లుగా ఆ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది. దాన్ని అలుసుగా తీసుకున్న ఓ చిట్‌ఫండ్ వ్యాపారి తన స్నేహితుడి ఇంట్లోనే కన్నం వేశాడు. మొత్తం రూ. 4.17 లక్షలు నొక్కేశాడు. కానీ.. పక్క ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరా పుణ్యమాని అడ్డంగా దొరికేశాడు. పోలీసులు నేరుగా అతడి ఇంటికి వెళ్లి మరీ పట్టుకుని కటకటాల్లో పెట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. రామచంద్రరావు అనే నిందితుడి కుటుంబ స్నేహితులైన రాజోత్తమ్ రెడ్డి దంపతులు వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఫిషర్పురా ప్రాంతంలో ఉంటారు. రామచంద్రరావు నివాసం జీడిమెట్ల. గురువారం సాయంత్రం రాజోత్తమ్ దంపతులు పనిమీద బయటకు వెళ్లారు. ఆ విషయం తెలిసిన రామచంద్రరావు, వాళ్ల ఇంట్లోకి వెళ్లి బీరువా తాళం తెరిచి రూ. 4.13 లోల నగదు తీసుకున్నాడు. వాస్తవానికి ఉదయమే ఆ ఇంటికి వెళ్లిన రామచంద్రరావు, అప్పుడే అక్కడి తలుపు గడియలకున్న స్క్రూలను లూజ్ చేసి ఉంచాడని, దాంతో తర్వాత సులభంగా దాన్ని తీసేశాడని పోలీసులు చెప్పారు. గురువారం సాయంత్రం బయటి నుంచి తిరిగొచ్చిన రాజోత్తమ్ రెడ్డి భార్య కవిత.. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు తెలిపారు. పోలీసులు చుట్టుపక్కల అంతా గాలిస్తుండగా, తన ఇంట్లో సీసీటీవీ కెమెరా ఉందని, దాని ఫుటేజి చూడమని పక్కింట్లో ఉండే నరేష్ అనే వ్యక్తి చెప్పారు. దాంట్లో రామచంద్రరావు లోపలకు వెళ్లడం, హడావుడిగా బయటకు రావడం రికార్డయింది. పోలీసులు వెంటనే అతడి ఇంటికి వెళ్లి సోదా చేసి, మొత్తం పోయిన సొత్తంతటినీ స్వాధీనం చేసుకున్నారు. అయితే.. 17 ఏళ్లుగా ఎంతో నమ్మకంగా ఉంటూ, చిట్‌ఫండ్ వ్యాపారంలో కూడా భాగస్వామి అయిన రామచంద్రరావు ఇలా చేశాడంటే బాధితులు నమ్మలేకపోతున్నారు. ఈ కేసును సులభంగా ఛేదించడంలో నరేష్ ఎంతగానో సాయపడ్డారని, ఆయనను అభినందించామని పోలీసులు తెలిపారు. -
ఔను...ప్రేమలో పడ్డాను!
యస్.. మీరు చదివింది నిజమే! అఖిల్ ప్రేమలో పడ్డారట. ‘నేనో అమ్మాయిని ప్రేమిస్తున్నాను’ అని ఓ ఆంగ్ల పత్రికకు సూటిగా, సుత్తి లేకుండా అసలు విషయాన్ని చెప్పేశారు అఖిల్. ఈ సిసింద్రీ మనసు దోచింది ఎవరో కాదట.. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఫ్రెండేనట. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అని ప్రశ్నిస్తే.. పేరు, ఇతర వివరాలు మాత్రం చెప్పనంటున్నారు అఖిల్. ఎందుకంటే ఆ అమ్మాయి పబ్లిసిటీకి దూరంగా ఉంటుందని చెప్పారు. ఇంతకీ అఖిల్ లవ్‌కి నాగార్జున, అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఇచ్చేశారట. ఆ అమ్మాయి ఫ్యామిలీ, నాగ్ ఫ్యామిలీ మధ్య ఎప్పట్నుంచో మంచి స్నేహం ఉందట. అయితే అఖిల్, ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్న విషయం మాత్రం కుటుంబ సభ్యులకు తెలియదు. ఇటీవల ఆ విషయాన్ని తన తల్లిదండ్రులతో అఖిల్ చెప్పారట. ఎప్పట్నుంచో తెలిసిన కుటుంబానికి చెందిన అమ్మాయి కావడంతో అఖిల్ లవ్‌ని నాగ్, అమల ఆమోదించారట. ఈ విషయాన్ని స్వయంగా అఖిలే చెప్పారు. ఆ అమ్మాయి గురించి చిన్న క్లూ మాత్రం దొరికింది. ఆ అమ్మాయి అప్‌కమింగ్ డిజైనర్ అనీ, న్యూయార్క్‌లో చదివిందనీ సమాచారం. -
శత్రుఘ్న సిన్హా రాయని డైరీ
- మాధవ్ శింగరాజు రాజకీయాల్లో కలకాల స్నేహితులు ఉండకపోతే పోయేరు! ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా లేకుండా పోతారా? ఒక పార్టీలోని వారికి ఇంకో పార్టీలోని వాళ్లతో స్నేహ సంబంధాలు లేకుండా పోతాయా? శత్రుత్వానిదేముంది? చిన్న మాటన్నా పుట్టుకొస్తుంది. బీజేపీకి అలాగే కదా శత్రువునయ్యాను. పార్టీలో ఉంటూ పార్టీకి రెస్పెక్ట్ ఇవ్వడం లేదని మావాళ్ల కంప్లైంట్! ‘వాజ్1పేయి కేబినెట్లో మినిస్టర్‌గా ఉన్నారు కదా, మోదీ కేబినెట్లో ఎందుకు లేరు?’ అని నా నియోజకవర్గం ప్రజలు అడిగినప్పుడు మోదీజీ గురించి ఒక్క మాటైనా నెగిటివ్‌గా మాట్లాడానా? అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా?! ముజఫర్‌పూర్‌లో ర్యాలీ పెట్టారు. మోదీజీ వచ్చారు. మాట్లాడారు. వెళ్లిపోయారు. నన్ను పిలవలేదు. పాట్నాలో ర్యాలీ పెట్టారు. అమిత్జీ వచ్చారు. మాట్లాడారు. వెళ్లిపోయారు. నన్ను పిలవలేదు. అప్పుడూ నేనేం మాట్లాడలేదే. అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా? బీజేపీలోంచి వెళ్లిపోతారట కదా, బీజేపీలోంచి వెళ్లగొడతారట కదా అని ఎవరెన్ని కూపీలు లాగినా... ‘మోదీజీనే నా లీడర్, బీజేపీనే నా పారీ’్ట అనే కదా చెప్పుకున్నాను. అది రెస్పెక్ట్ ఇవ్వడం కాదా?! కాంగ్రెస్ వాళ్లను సపోర్ట్ చెయ్యకూడదు. నితీశ్ కుమార్ ఇంటికి వెళ్లకూడదు. ఇదీ వీళ్లు నా నుంచి ఆశించే రెస్పెక్ట్! కరెక్టేనా? నితీశ్ నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సీయెం అయ్యాక నా ఫ్రెండ్ కాలేదు. పీయెంకు ఆయనంటే పడదని తెలిసాక నా ఫ్రెండ్ కాలేదు. ఎప్పుడు పాట్నా వచ్చినా పండ్లబుట్టతో వెళ్లి కలుస్తాను. కాంగ్రెస్‌లో కూడా నితీశ్ లాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. సభలోంచి వాళ్లు సస్పెండ్ అవడం నాకు సంతోషం కలిగించే సంగతి ఎలా అవుతుంది? ‘అలా జరిగుండాల్సింది కాదు’ అన్నాను. ప్రతాప్ రూడీ విరుచుకుపడ్డాడు. ‘సినిమా మనిషికేం తెలుసు పార్లమెంటు పాలిటిక్సు’ అన్నాడు. నేను సినిమా మనిషినా! చాన్సులు లేక రాలేదే. వయసైపోయాక రాలేదే. నా అంతట నేను రాలేదే. జేపీ నన్ను లాగారు. బీజేపీ నన్ను లాక్కుంది. నితీశ్‌తో మూడు గంటలసేపు మాట్లాడ్డానికి ఏముంటుందని బీజేపీ అనుమానం! చాలా మాట్లాడుకున్నాం. కళల గురించి, కవిత్వం గురించి. నాతో పాటు నితీశ్ ఇంటికి వచ్చిన పవన్ వర్మ కొన్ని గాలిబ్ గీతాలు కూడా పాడాడు. ‘నేను నిజం ఎందుకు మాట్లాడతానంటే, అబద్ధం చెప్పడం రాదు కాబట్టి. అలాంటప్పుడు నిన్ను ప్రేమించడం లేదని ఎలా చెప్పగలను’ అంటాడట మీర్జా గాలిబ్! నేను బీజేపీలో ఉన్నంత మాత్రాన, బీజేపీలో లేని నితీశ్ నా స్నేహితుడు కాదని ఎలా చెప్పగలను?