సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీ ఏరియాలోని భాటియా కుటుంబంలోని 11మంది అనుమానాస్పద స్థితిలో మరణించటం యావత్ దేశాన్ని కలిచివేస్తోంది. క్షుద్ర పూజల ప్రభావానికి లోనయి మోక్షం కోసం వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంతా భావిస్తున్నారు. వారిలో ఆరుగురు ఉరికి వేలాడిన ఊపిరాడక చనిపోయినట్టుగా పోస్ట్‌మార్టం నివేదిక తేల్చింది. చనిపోయిన 11 మంది నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబ సభ్యులు నిర్ణయించారు. దీంతో 22 మందికి ఆ నేత్రాలు ఉపయోగపడనున్నాయి. భాటియాది చాలా మంచి కుటుంబం అని, వారు ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలన్న ఆలోచనతోనే ఉండేవారని ఫ్యామిలీ ఫ్రెండ్ నవ్‌నీత్ బత్రా తెలిపారు. అందుకే ఆ 11 మంది కండ్లను దానం చేసేందుకు అంగీకరించామని, దానికి కావాల్సిన అప్రూవల్ లెటర్ కూడా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
1st thing we did was to donate their eyes that could provide eyesight to 22 people, considering the family was religious & always wanted to help others. We gave approval letter yesterday: Navneet Batra,Friend of the family whose 11 members were found dead in #Delhi's Burari y'day pic.twitter.com/0s14vEsI0n
— ANI (@ANI) 2 July 2018
Comments
Please login to add a commentAdd a comment