తెరపై పోలీస్ సిద్దయ్య కథ | nalgonda si siddaiah life story movie | Sakshi
Sakshi News home page

తెరపై పోలీస్ సిద్దయ్య కథ

Published Thu, Jul 30 2015 12:03 AM | Last Updated on Tue, Aug 21 2018 7:34 PM

తెరపై పోలీస్ సిద్దయ్య కథ - Sakshi

తెరపై పోలీస్ సిద్దయ్య కథ

కొంతకాలం క్రితం నల్గొండ దగ్గర తీవ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు సిద్దయ్య గుర్తే కదా!

 కొంతకాలం క్రితం నల్గొండ దగ్గర తీవ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీసు సిద్దయ్య గుర్తే కదా! ఆ పోలీసు నిజజీవిత కథ ఆధారంగా రూపొందనున్న చిత్రం ‘మిస్టర్ కె’. ‘...ఖాకీ సత్తా’ అనేది ఉపశీర్షిక. కౌశిక్ బాబు ప్రధాన పాత్రలో లోకేశ్ ఆకుల, దివ్యా సునీత రాజ్, ఎస్. చిట్టిబాబు. వి.రామచంద్రమూర్తి నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశాంక్ వోలేటి దర్శకుడు. ఏషియన్ థియేటర్స్ అధినేత నారాయణదాస్ కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు క్లాప్ నిచ్చారు. ‘‘సమాజానికి ఉపయోగపడే ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ చిత్రానికి కథ: శారదా విజయబాబు, మాటలు: మోహన్ దీక్షిత్, సంగీతం: నాగ్ శ్రీవత్స.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement