
ఎన్నో చేశా... వర్కవుట్ కాలేదు!
నమిత ఎక్కడ? కొన్ని నెలలుగా చెన్నయ్‌లో జరిగిన చర్చ ఇది. బాగా లావయ్యారు కాబట్టి, సినిమా అవకాశాలు లేక సొంత ఊరు సూరత్ వెళ్లిపోయారని చాలామంది ఊహించారు. ఆ ఊహలకు ఫుల్‌స్టాప్ పెడుతూ, నమిత హఠాత్తుగా మీడియా ముందుకొచ్చారు. అందరూ ఆశ్చర్యపోయేలా బాగా సన్నబడిపోయారు. మూడు నెలల్లో 18 కిలోలు బరువు తగ్గానని తెలిపారు. అంతకు ముందు బరువు పెరగడానికి కారణం డిప్రెషన్‌లోకి వెళ్లడమే అని స్పష్టం చేశారు. కానీ, డిప్రెషన్‌కి ఎందుకు గురయ్యారో చెప్పలేదు.
ఆ డిప్రెషన్ కారణంగా బాగా తినేదాన్ననీ, అందుకే లావయ్యాననీ తెలిపారు. సన్నబడడానికి ఎన్నో చేశాననీ, వర్కవుట్ కాలేదనీ వివరించారు. ‘సాక్షి వెల్‌నెస్’ అనే క్లినిక్ వారి సహాయంతో ఇలా సన్నబడ్డానని నమిత పేర్కొన్నారు. ఇక, సినిమా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నానని చెప్పారు. రాజకీయాల్లోకి వస్తారా? అని ఓ విలేకరి అడిగితే... పలు రాజకీయ పార్టీలు ఆహ్వానించాయనీ, పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యే ఉద్దేశం ఉందనీ తెలిపారు.