
దక్షిణాది నటి నమిత తన సహనటుడు వీర్ ను పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ నెల 24న వీరి పెళ్లి వేడుక తిరుపతిలో జరగనుంది. తన పెళ్లి శుభలేఖతో పాటు తన ప్రేమకథను కూడా అభిమానులతో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ. 'అందరికీ హాయ్, నేను, వీర్ పెళ్లి చేసుకోబోతున్న విషయం మీ అందరికీ తెలుసనుకుంటున్నాను. నా బెస్ట్ ఫ్రెండ్ శశిధర్ బాబు ద్వారా గత ఏడాది వీర్ నాకు పరిచయం అయ్యాడు.తరువాత మేం కూడా మంచి స్నేహితులమయ్యాం.
సెప్టెంబర్ 6, 2017న ప్రత్యేకంగా నాకోసం ఏర్పాటు చేసిన క్యాండిల్ లైట్ డిన్నర్ లో వీర్ నాకు ప్రపోజ్ చేశాడు. ఆ సమయంలో నేను ఎటూ తేల్చుకోలేకపోయా..! కానీ మా ఇద్దరి లక్ష్యాలు ఒకటే కావటం, ఇద్దరిలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండటం మమ్మల్ని దగ్గర చేసింది. అంతేకాదు ఇద్దరికి ప్రయాణాలు చేయటం ఇష్టం, ముఖ్యంగా ట్రెక్కింగ్ అంటే ఇష్టం. ఇద్దరం జంతువులను ప్రేమిస్తాం. ఇలా చాలా విషయాల్లో ఇద్దరి ఆలోచనా విధానం ఒకటే కావటంతో నేను నో చెప్పలేకపోయా. గత మూడు నెలలుగా వీర్ ను మరింతగా అర్థం చేసుకున్నా. తనతో కలిసుండటం అధృష్టంగా భావిస్తున్నా. మాకు మద్ధతుగా నిలిచి వారందరికీ కృతజ్ఞతలు'. అంటూ ఓ ప్రకటన విడుదల చేసింది నమిత.
Comments
Please login to add a commentAdd a comment