'డి ఫర్ దోపిడీ'కి నాని వాయిస్ ఓవర్ | Nani gives voiceover for 'D for Dopidi' | Sakshi
Sakshi News home page

'డి ఫర్ దోపిడీ'కి నాని వాయిస్ ఓవర్

Published Tue, Sep 24 2013 12:39 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

'డి ఫర్ దోపిడీ'కి నాని వాయిస్ ఓవర్ - Sakshi

'డి ఫర్ దోపిడీ'కి నాని వాయిస్ ఓవర్

జల్సా సినిమాకు ముందు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుంది కదూ.. ఇప్పుడు యువహీరో నాని కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. ముందే రేడియో జాకీగా చేసిన అనుభవం ఉండటంతో వాయిస్ ఓవర్ ఇచ్చేందుకు ఠకీమని ఒప్పేసుకున్నాడు. నిర్మాణదశలో ఉన్న 'డి ఫర్ దోపిడీ' చిత్రానికి నాని వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. చిత్ర నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె అంటే నానికి చాలా గౌరవమని, అందుకే వాళ్లు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి చెప్పగానే వెంటనే ఒప్పుకున్నాడని సినిమాలో నటిస్తున్న సందీప్ కిషన్ తెలిపాడు.

సిరాజ్ కల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్, నవీన్, రాకేష్, మెలానీ కన్నొకడ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. గతంలో 'షోర్ ఇన్ ద సిటీ', 'గో గోవా గాన్' లాంటి చిత్రాలు నిర్మించిన రాజ్, డీకే సంయుక్తంగా 'డి ఫర్ దోపిడీ' తీస్తున్నారు. ఇది త్వరలోనే విడుదల కానుంది. నాని నటించిన పైసా, జెండాపై కపిరాజు చిత్రాలు త్వరలో విడుదల కానున్నాయి. 'బ్యాండ్ బాజా బరాత్' చిత్రం రీమేక్లో కూడా నాని నటిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement