అంచనాలు పెంచేస్తోన్న నాని | nani, Hanu ragavapudi krishnagadi veera premagadha | Sakshi
Sakshi News home page

అంచనాలు పెంచేస్తోన్న నాని

Published Fri, Feb 5 2016 2:05 PM | Last Updated on Wed, Aug 29 2018 9:26 PM

అంచనాలు పెంచేస్తోన్న నాని - Sakshi

అంచనాలు పెంచేస్తోన్న నాని

2012లో రిలీజ్ అయిన ఈగ సినిమా తరువాత సక్సెస్ వేటలో వెనుక పడిన నాని ఇప్పుడు మళ్లీ ఫాంలోకి వచ్చాడు. గత ఏడాది రిలీజ్ అయిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన నాని... తరువాత భలే భలే మొగాడివోయ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించి మంచి కలెక్షన్ స్టామినా ఉన్న యంగ్ హీరోగా ఎదిగాడు. ఇప్పుడు అదే జోరులో 'కృష్ణగాడి వీర ప్రేమగాథ'తో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన కృష్ణగాడి వీర ప్రేమగాథ, ఆడియో, టీజర్స్కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గత సినిమాల సక్సెస్తో నాని మీద ఏర్పడ్డ అంచనాలకు తగ్గట్టుగా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా అందాల రాక్షసి సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కటం, కూడా సినిమా మీద అంచనాలు పెరగటానికి మరో కారణం.

నాని బాలకృష్ణ అభిమానిగా నటిస్తున్న ఈ సినిమాతో మెహరీన్ హీరోయిన్గా పరిచయం అవుతోంది. మహేష్ బాబు, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్తో సినిమాలు నిర్మించిన 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ తొలిసారిగా ఓ చిన్న సినిమాను తెరకెక్కిస్తుండటం కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతున్న కృష్ణగాడి వీర ప్రేమగాథ. నాని విజయగాథను కొనసాగుతుందన్న నమ్మకంతో ఉన్నారు యూనిట్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement