నాన్‌ఈకి సీక్వెల్ ఉంటుందా? | Nani Waiting For Eega Movie Sequel | Sakshi
Sakshi News home page

నాన్‌ఈకి సీక్వెల్ ఉంటుందా?

Published Tue, Oct 4 2016 3:15 AM | Last Updated on Thu, Sep 27 2018 8:55 PM

నాన్‌ఈకి సీక్వెల్ ఉంటుందా? - Sakshi

నాన్‌ఈకి సీక్వెల్ ఉంటుందా?

నాన్‌ఈ చిత్రం ఒక సంచలనం. గ్రాఫిక్స్‌కు పరాకాష్ట అని కూడా చెప్పవచ్చు. అన్నిటికీ మించి దర్శకుడు రాజమౌళి అద్భుత సెల్యులాయిడ్ సృష్టి. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఈగ పేరుతో తెరపైకి వచ్చింది. ఈ రెండు భాషల్లోనూ విజయఢంకా మోగించిన చిత్రం నాన్‌ఈ. అంతే కాదు హిందీ భాషలోకి మఖా పేరుతో అనువాదమై అక్కడి ప్రేక్షకులను వావ్ అనిపించింది. నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా కన్నడ సూపర్‌స్టార్ సుదీప్ ప్రతినాయకుడిగా వీర విహారం చేసిన చిత్రం ఇది. కాగా సీక్వెల్స్ నడుస్తున్న కాలం ఇది. విజయవంతమైన పలు చిత్రాలకు రెండు, మూడు భాగాలు తెరకెక్కుతున్నాయి. అలాంటిది వెండితెరపై వండర్స్ క్రియేట్స్ చేసిన నాన్‌ఈ చిత్రానికి కొనసాగింపును ప్రేక్షకులు ఆశించడం సబబే. అందుకు కారణం లేకపోలేదు.
 
 చిత్ర దర్శకుడు రాజమౌళికి ఈ చిత్రానికి సీక్వెల్ తీసే ఆలోచన ముందు ఉన్నట్లుంది. చిత్రం చివరిలో ఐ విల్ బ్యాక్ అని ముగింపు ఇచ్చారు. కాగా నాన్‌ఈ చిత్ర సీక్వెల్‌కు సన్నాహాలు జరుగుతున్నాయనే ప్రచారం తాజాగా మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి బాహుబలి-2ని చెక్కుతున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.
 
 తదుపరి రాజమౌళి నాన్‌ఈ సీక్వెల్‌ను హ్యాండిల్ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదటి భాగంలో నటించిన నానినే రెండో భాగంలోనూ హీరోగా నటించనున్నట్లు, ఇక విలన్ పాత్ర సుదీప్ కిచ్చా రెడీ అన్నట్లు పరిశ్రమ వర్గాల టాక్. మరి ప్రియుడు నాగచైతన్యతో మూడుముళ్ల బంధానికి సిద్ధం అవుతున్న చెన్నై చంద్రం సమంత ఈ సీక్వెల్‌లో ఉంటారా? అన్నది వేచి చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement