మురుగదాస్ కథతో... | nara rohith act Murugadoss story | Sakshi
Sakshi News home page

మురుగదాస్ కథతో...

Published Fri, Jun 12 2015 11:36 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మురుగదాస్ కథతో... - Sakshi

మురుగదాస్ కథతో...

 ప్రముఖ దర్శకుడు మురుగదాస్ ఇచ్చిన కథతో నారా రోహిత్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో శ్రీ కీర్తి ఫిలింస్ పతాకంపై రూపొందనున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. అశోక్, నాగార్జున్ నిర్మాతలు. ఈ చిత్రంలో నారా రోహిత్‌ది విభిన్నమైన పాత్ర అని, వాణిజ్య అంశాలు మెండుగా ఉన్న చిత్రమనీ దర్శకుడు తెలిపారు.
 
 ఇప్పటివరకూ నారా రోహిత్ చేసిన చిత్రాలన్నిటికన్నా అధిక నిర్మాణ వ్యయంతో రూపొందే చిత్రం ఇదే అవుతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: పళనీ కుమార్, ఆర్ట్: మురళి కొండేటి, ఎడిటింగ్: మధు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement