
పునీత్ రాజ్‌కుమార్
నటసార్వభౌమ... అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో ఇలా పిలిపించుకోవడం. ఇదే టైటిల్‌తో కన్నడలో ఓ సినిమా రూపొందుతోంది. కన్నడ సూపర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా పవన్ వడియార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘నటసార్వభౌమ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాక్‌లైన్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. పునీత్ కెరీర్‌లో ఇది 28వ సినిమా కావడం విశేషం.
డి. ఇమ్మాన్ స్వరకర్త. ఈ సినిమా కోసం ఆల్రెడీ పునీత్ రాజ్‌కుమార్ కొత్త లుక్‌లోకి మారిపోయారు. ఆయన బర్త్‌డే సందర్భంగా సినిమా లుక్ టీజర్‌ను లాంచ్ చేశారు. ‘‘నటసార్వభౌమ టైటిల్‌తో సినిమా చేయడానికి గర్వంగా ఫీలవుతున్నాను. కానీ కాస్త నెర్వస్‌గా కూడా ఉంది. ఆ టైటిల్‌కు, నా పాత్రకు న్యాయం చేస్తాననే అనుకుంటున్నాను. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు పునీత్ రాజ్‌కుమార్.
Comments
Please login to add a commentAdd a comment