
తమిళసినిమా: నటి నయనతార గురి పెడితే లక్ష్య సాధనే అనే స్థాయికి చేరుకున్నారు. కోలీవుడ్‌లో నంబర్‌ఒన్ స్థానంలో వెలిగిపోతున్న ఈ బ్యూటీ అరమ్ చిత్రంలో కలెక్టర్‌గా నటించి సంచలన విజయాన్ని అందుకుంది. మాయ చిత్రం తరువాత నయనతార లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రంతో హిట్ కొట్టిన చిత్రం అరమ్. పెద్ద హీరోల రేంజ్‌లో వసూళ్లు సాధిస్తున్న ఆ చిత్రం నవంబర్‌లో విడుదలై డి సెంబర్‌లో కూడా థియేటర్లలో నిలబడింది. ఇదిలా ఉంటే నయనతార జనవరిపైనా గురిపెట్టారు. స్టార్ చిత్రాల నెలగా భావించే జనవరిలో సంక్రాంతి, రిపబ్లిక్ దినోత్సవం అంటూ సినిమాల పండగ దినాలున్నాయి.ఈ తేదీలో నయనతార తన తాజా చిత్రం ఇమైకా నోడిగళ్ చిత్రాన్ని గురిపెట్టారు. యువ నటుడు అధర్వ కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో హైదరాబాదీ బ్యూటీ రేష్మీఖన్నా కథానాయకిగా నటిస్తోంది.ఈ అమ్మడికిదే ఇక్కడ తొలి చిత్రం అవుతుంది.
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా కోలీవుడ్‌కు దిగుమతి అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార సీబీఐ ఆధికారిగా ఒక పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. ఆమెకు జంటగా సక్సెస్‌ఫుల్ నటుడు విజయ్‌సేతుపతి కీలక పాత్రలో మెరస్తుండడం విశేషం. ఈ జంట ఇంతకు ముందు నానుమ్ రౌడీదాన్ చిత్రంతో హిట్ కొట్టారన్నది గమనార్హం. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. హిప్ హాప్ తమిళా ఆది సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని చిత్ర వర్గాలు వెల్లడించారు.అయితే శనివారమే విజయ్‌సేతుపతి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారట. నయనతారతో ఆయన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఈ చిత్రాన్ని జనవరిలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment