కొత్త బాడీ లాంగ్వేజ్! సరికొత్త వేషం!! | new body language ! new get up !! | Sakshi
Sakshi News home page

కొత్త బాడీ లాంగ్వేజ్! సరికొత్త వేషం!!

Published Fri, Feb 27 2015 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

కొత్త బాడీ లాంగ్వేజ్! సరికొత్త వేషం!!

కొత్త బాడీ లాంగ్వేజ్! సరికొత్త వేషం!!

‘అందాల రాముడు’, ‘మర్యాద రామన్న’, ‘పూల రంగడు’ తదితర చిత్రాలతో హాస్య నటుడు సునీల్ హీరోగా స్థిరపడిపోయారు. ప్రస్తుతం ఆయన హీరోగా ఆర్.పి.ఏ క్రియేషన్స్ పతాకంపై ఆర్. సుదర్శన్‌రెడ్డి ఓ చిత్రం నిర్మించనున్నారు. ‘రక్ష' ఫేం వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. శనివారం సునీల్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రవిశేషాలను తెలియజేశారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మా సంస్థ తీసిన తొలి చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

మలి చిత్రం కూడా ఆ స్థాయిలో ఉండాలనే ఆకాంక్షతో చాలా కథలు విన్నాం. వంశీకృష్ణ చెప్పిన కథ బాగా నచ్చింది. సునీల్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి చిత్రం కోరుకుంటారో అలా ఉంటుంది. ఈ చిత్రంలో ఆయన శారీరక భాష కొత్తగా ఉంటుంది. త్వరలో చిత్రీకరణ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘ఒక మంచి వాణిజ్య చిత్రానికి ఎలాంటి అంశాలు ఉండాలో అవన్నీ పుష్కలంగా ఉన్న చిత్రం ఇది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఆర్. ఆయుష్‌రెడ్డి, ఆర్.పి. అక్షిత్‌రెడ్డి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement