
మాస్ మహారాజ రవితేజతో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ జతకట్టనుంది. ‘రాక్షసుడు’ ఫేం రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఏ స్టూడియోస్ పతాకంపై హవీష్ ప్రొడక్షన్‌లో సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఇద్దరి హీరోయిన్లకు అవకాశం ఉండటంతో, ఓ కథానాయికగా నిధి అగర్వాల్‌ను చిత్ర బృందం ఎంపిక చేసింది. మరో హీరోయిన్ పేరును ప్రకటించలేదు. అయితే త్వరలోనే మరో కథానాయిక పేరుతో పాటు ఇతర తారాగణం వివరాలు వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.
డిస్కోరాజా తర్వాత మాస్ మహారాజ రవితేజ చేస్తున్న తాజా చిత్రం ‘క్రాక్’. శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ తుది దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టనుంది. ఇప్పటికే పోలీస్ ఆఫీసర్ లుక్‌లో రవితేజ రఫ్పాడిస్తుండగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ నెగటీవ్ షేడ్‌లో కొత్తగా కనిపించింది. బి.మధు నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతమందిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment