
నిహారిక, జొన్నలగడ్డ చైతన్య
హీరోయిన్ నిహారికకు కాబోయే భర్త ఎవరో అధికారిక ప్రకటన వెల్లడైంది. గుంటూరు పోలీసుశాఖలో ఐజీగా విధులు నిర్వర్తిస్తున్న జొన్నలగడ్డ ప్రభాకర్ కుమారుడు జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయబోతున్నారు. ‘నా మిగతా జీవితం సంతోషంగా గడిచేందుకు తగ్గ వ్యక్తి (చైతన్యను ఉద్దేశిస్తూ) నాకు దొరికారు. ఈ క్షణాలు చాలా థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. మా నిశ్చితార్థం త్వరలో జరగబోతోందని చెప్పడానికే గురువారం సోషల్ మీడియాలో అలా హింట్ ఇచ్చాను. ప్రస్తుతం ఇంతకన్నా నేనేం చెప్పలేను’’ అని పేర్కొన్నారు నిహారిక. ‘‘చైతన్య, నిహారికలది అరేంజ్డ్ మ్యారేజ్. నిజంగా చైతన్య, నిహారికలకు ఒకరికొకరు పరిచయం లేదు.
గత వారం వారి ఫ్యామిలీని కలిశాం. చైతన్య, నిహారికలు పర్‌ఫెక్ట్ కపుల్ అవుతారని భావించాం. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. మంచి తేదీ కుదిరితే ఈ ఏడాదే వివాహం జరగవచ్చు. వారు (నిహారిక ఫ్యామిలీ) త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు’’ అని ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు ప్రభాకర్. చైతన్య – నిహారికల నిశ్చితార్థం ఈ ఏడాది ఆగస్టులో జరగనుందని సమాచారం. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్ పిలానీలో మాస్టర్స్ ఇన్ మ్యాథమ్యాటిక్స్ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment