‘కార్తికేయ’ ప్రశ్నలు | nikhil-swathi new movie karthikeya | Sakshi
Sakshi News home page

‘కార్తికేయ’ ప్రశ్నలు

Published Fri, Feb 7 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

‘కార్తికేయ’ ప్రశ్నలు

‘కార్తికేయ’ ప్రశ్నలు

 ‘స్వామి రారా’తో హిట్ పెయిర్ అనిపించుకున్న నిఖిల్, స్వాతి జంటగా రూపొందుతున్న తాజా చిత్రం ‘కార్తికేయ’. చందు మొండేటి దర్శకత్వంలో వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక్క పాట మినహా పూర్తయ్యింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘థ్రిల్లర్ కథాంశంతో రూపొందిస్తున్న లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న ఉండదని, ఒకవేళ సమాధానం దొరక్కపోతే మన  ప్రయత్న లోపమే అని నమ్మే మనస్తత్వం హీరోది.
 
  ఈ నేపథ్యంలో అతనికి ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయి? తద్వారా ఎలాంటి సంఘటనలు ఎదుర్కొంటాడు? అనేది కీలక అంశం’’ అని చెప్పారు. మార్చి మొదటి వారంలో పాటలను, అదే నెలాఖరున చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: కార్తిక్ ఘట్టమనేని,  సమర్పణ: శిరువూరి రాజేష్‌వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement