'ఈగ'కు 9 అంతర్జాతీయ అవార్డులు | Nine Awards for 'Eega' at Toronto After Dark Film Festival | Sakshi
Sakshi News home page

'ఈగ'కు 9 అంతర్జాతీయ అవార్డులు

Published Sun, Nov 3 2013 11:44 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

'ఈగ'కు 9 అంతర్జాతీయ అవార్డులు

'ఈగ'కు 9 అంతర్జాతీయ అవార్డులు

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సంచలనాల పరంపర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ప్రేక్షకులతో ప్రసంశలతో పాటు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటోంది. ఇటీవల జరిగిన 8వ టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'ఈగ' సత్తా చాటింది. 9 అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఫైట్ విభాగంలోనూ ఈ సినిమాకు అవార్డు రావడం విశేషం. ఈ సినిమాలో హీరో నాని, విలన్ సుదీప్ మధ్య పోరాట సన్నివేశాలే లేవు. కాని సుదీప్పై ఈగ చేసిన పోరాటాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి.

ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు యాక్షన్ ఫిల్మ్, కామెడీ, మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్ , ఫైట్స్, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు సాధించింది. ఉత్తమ విలన్(సుదీప్), ఉత్తమ హీరో(ఈగ/నాని) పురస్కారాలు దక్కించుకుంది. రెండు జాతీయ అవార్డు దక్కించుకున్న పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement