Eega
-
రాజమౌళికి కొత్త అభిమానిని : నైజీరియా దర్శకురాలు
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా ప్రపంచ దేశాల్లో భారీ వసూళ్లు సాధించటంతో పాటు భారతీయ సినిమా స్థాయిని ఎన్నో రెట్లు పెంచింది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శితమైన ఈసినిమాపై అంతర్జాతీయ స్థాయి సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ లిస్ట్ లో మరో టాప్ డైరెక్టర్ చేశారు. నైజీరియాకు చెందిన మహిళా దర్శకురాలు టోపె ఓషిన్ ఇటీవల బాహుబలి సినిమాను చూసి సినిమాపై తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. బాహుబలి సినిమా రెండు భాగాలను మార్చి మార్చి చూసినట్టుగా వెల్లడించినా ఓషిన్, ఎలా స్పందించాలో అర్థం కావటం లేదని ట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ మాస్టర్ పీస్. సినిమా చూస్తున్నప్పుడు నాకు బాధ, ఆశ్చర్యం, ఆనందం, ఉద్వేగం కలిగాయి.నా మీద బాహుబలి ఎఫెక్ట్ కనిపిస్తోంది. బాహుబలి సినిమా కోసం ఎంత సమయమైనా కేటాయించ వచ్చు అందుకే స్క్రిప్ట్, ఎడిటింగ్ లాంటి చాలా పనులున్నా పక్కన పెట్టి సినిమా చూశాను. నేను మళ్లీ బాహుబలి గురించి ట్వీట్ చేయకుండా ఉండగలనేమో చూస్తాను. అంటూ ట్వీట్ చేశారు. త్వరలోనే రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను కూడా చూస్తానని వెల్లడించారు ఓషిన్. This film experience called #Baahubali Still catching my breath. I’ll come back and tweet a lot. Or maybe too little, if I still find myself tongue tied and catching my breath. 😮😮😮😮 — Tope Oshin (@topeoshin) 15 January 2018 I watched Part 1. And then the 1st half of Part 1 again. And then Part 2. And I’m going back to watch Part 1 again now, and then I know I’ll watch part 2 again. Whaaaat. I’m not going to recover from this film in a while. @niyiakinmolayan you were sooooo right!!! #Baahubali — Tope Oshin (@topeoshin) 15 January 2018 Right now I feel very unworthy to share same #Filmmaker title with the makers of #Baahubali It’s a complete masterpiece, judged by the entire experience you get from watching it. Bowing in awe! 🙇🏽♀️ 🙇🏽♀️ 🙇🏽♀️ — Tope Oshin (@topeoshin) 15 January 2018 I’m excited, sad, happy, content, wowed, entertained, spellbound, intimidated, encouraged, transported, all in one from watching #Baahubali! I guess it’s what I’ll now call #TheBaahubaliEffect 😰🤩😱❤️ — Tope Oshin (@topeoshin) 15 January 2018 And yes I have and am in the middle of pending work. Edits. Scripts to read and review, emails to draft and reply. But this #Baahubali break was worth stopping everything and more! 😰😰😰 Now, back to work. I’ll try not to tweet about the film again. I hope. 🤔 — Tope Oshin (@topeoshin) 15 January 2018 -
హాలీవుడ్లో దక్షిణాది నటుడు
ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సుధీప్, కన్నడనాట స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. హీరోగా నటిస్తూనే ఇతర భాషల్లో కీలక పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఈ విలక్షణ నటుడ్ని మరో అద్భుత అవకాశం వరించింది. ఓ హాలీవుడ్ సినిమాలో సుధీప్ కీలక పాత్రలో నటించనున్నాడు. ఆస్ట్రేలియన్ దర్శకుడు ఎడ్డీ ఆర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైసెన్ అనే ఆంగ్ల చిత్రంలో సుధీప్ నటిస్తున్నాడు. సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టర్లోనే సుధీప్ కనిపించటంతో హాలీవుడ్ సినిమాలో తమ అభిమాన నటుడిది కీలక పాత్ర అని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ సినిమాలో సుధీప్ న్యూయార్క్ లో స్థిరపడిన ఆర్మీ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో అమెరికన్ స్టార్ హీరోయిన్ నికోలే స్కాల్మో హీరోయిన్ గా నటిస్తోంది. సాండల్‌వుడ్‌లో స్టార్ హీరోగా మంచి ఫాలోయింగ్ ఉన్న సుధీప్ ఈగ సినిమాతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. ప్రస్తుతం శివరాజ్ కుమార్ తో కలిసి విలన్ అనే సినిమాలో నటిస్తున్న సుధీప్, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి లోనూ కీలకపాత్రలో నటించనున్నాడు. -
2012-13 నాటి నంది అవార్డులు ప్రకటన
-
నంది అవార్డులను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
-
నంది అవార్డులను ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. కొంత కాలంగా నంది అవార్డులను తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఇస్తుందన్న సస్పెన్స్‌కు తెర పడింది . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులను ఇస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2012, 2013 సంవత్సరాలకు గాను నంది అవార్డులను ప్రకటించింది. 2012 సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ఈగ, ఎటోవెళ్లిపోయింది మనసు, మిథునం సినిమాలు పోటి పడ్డాయి. ఈగ సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు అవార్డులతో కలిపి తొమ్మిది అవార్డులను సొంతం చేసుకోగా, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాకు నాలుగు అవార్డులు దక్కాయి. మిథునంకు రెండు, మిణుగురులుకు ఐదు అవార్డులు దక్కాయి. ఎస్వీ రంగారావు పురస్కారానికి గాను ఆశిష్ విద్యార్థిని ఎంపిక చేశారు. సీనియర్ నటి జయసుథ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ ఎంట్రీ లను పరిశీలించి విజేతలను నిర్ణయించింది. 2012 నంది అవార్డుల వివరాలు : ఉత్తమ చిత్రం : ఈగ ద్వితీయ ఉత్తమ చిత్రం : మిణుగురులు తృతీయ ఉత్తమ చిత్రం : మిథునం ఉత్తమ దర్శకుడు : రాజమౌళి ( ఈగ ) ఉత్తమ నటుడు : నాని (ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ నటి : సమంత (ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ విలన్ : సుదీప్ (ఈగ) ఉత్తమ సహాయ నటుడు : అజయ్ (ఇష్క్) ఉత్తమ సహాయ నటి : శ్యామలా దేవి (వీరంగం) ఉత్తమ హాస్య నటుడు : రఘుబాబు (ఓనమాలు) ఉత్తమ బాలనటుడు : దీపక్ సరోజ్ (మిణుగురులు) ఉత్తమ బాలనటి : రుషిణి ( మిణుగురులు) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : అయోద్య కుమార్ ( మిణుగురులు ) ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ : రాజమౌళి (ఈగ) ఉత్తమ కథా రచయిత : అయోద్య కుమార్ ( మిణుగురులు) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సెంథిల్ కుమార్ (ఈగ) ఉత్తమ గాయకుడు : శంకర్ మహదేవన్ ( ఒక్కడే దేవుడు, శిరిడి సాయి) ఉత్తమ గాయని : గీతామాధురి ( యదలో నదిలాగ, గుడ్ మార్నింగ్) ఉత్తమ కళాదర్శకుడు : ఎస్ రామకృష్ణ ( అందాల రాక్షసి) ఉత్తమ కొరియోగ్రాఫర్ : జానీ ( మీ ఇంటికి ముందో గేటు, జులాయి) ఉత్తమ ఆడియో గ్రాఫర్ : కడియాల దేవీ కృష్ణ (ఈగ) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల( కృష్ణంవందే జగద్గురుం) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : చిట్టూరి శ్రీనివాస్ ( కృష్ణంవందే జగద్గురుం) ఉత్తమ మాటల రచయిత : తనికెళ్ల భరణి (మిథునం) ఉత్తమ గేయ రచయిత : అనంత్ శ్రీరామ్ (కోటికోటి తరల్లోనా, ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ సంగీత దర్శకుడు : కీరవాణి(ఈగ), ఇళయరాజా(ఎటో వెళ్లిపోయింది మనసు) ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు (ఈగ) ఉత్తమ ఫైట్స్ : గణేష్ ( ఒక్కడినే) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : ఆర్ సీ యం రాజు (మిణుగురులు) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీమేల్ : శిల్ప (వీరంగం) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : మకుట విఎఫ్ఎక్స్ ( ఈగ) ఎస్వీ రంగారావు పురస్కారం : ఆశిష్ విద్యార్థి (మిణుగురులు) 2013 సంవత్సరానికి గాను మిర్చి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలకు అవార్డుల పంట పండింది. ఉత్తమ చిత్రం : మిర్చి రెండో ఉత్తమ చిత్రం : నా బంగారు తల్లి మూడో ఉత్తమ చిత్రం : ఉయ్యాల జంపాల ఉత్తమ కుటుంబ కథా చిత్రం : సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం : అత్తారింటికి దారేది ఉత్తమ హీరో : ప్రభాస్ (మిర్చి) ఉత్తమ హీరోయిన్ : అంజలి పాటిల్ (నా బంగారు తల్లి) ఉత్తమ దర్శకుడు : దయా కొడవగంటి (అలియాస్ జానకి) ఉత్తమ సంగీత దర్శకుడు : దేవీ శ్రీ ప్రసాద్ (అత్తారింటికి దారేది) ఉత్తమ సహాయ నటుడు : ప్రకాష్ రాజ్ (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు) ఉత్తమ సహాయ నటి : నదియా (అత్తారింటికి దారేది) ఎస్వీ రంగారావు పురస్కారం : నరేష్ (పరంపర) ఉత్తమ హాస్య నటుడు : తాగుబోతు రమేష్ ( వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) ఉత్తమ విలన్ : సంపత్ రాజ్ (మిర్చి) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : కొరటాల శివ (మిర్చి) ఉత్తమ మాటల రచయిత : త్రివిక్రమ్ శ్రీనివాస్ ( అత్తారింటికి దారేది) ఉత్తమ గేయ రచయిత : సిరివెన్నెల సీతారామశాస్త్రీ ( మరీ అంతగా, సీతమ్మ వాకిట్లో సిరమల్లె చెట్టు) ఉత్తమ గాయకుడు : కైలాష్ ఖేర్ ( పండగలా దిగివచ్చాడు, మిర్చి) ఉత్తమ గాయని : కల్పన (నవ మూర్తులైనట్టి, ఇంటింటా అన్నమయ్య) ఉత్తమ ఎడిటర్ : ప్రవీణ్ పూడి (కాళీచరణ్) ఉత్తమ బాల నటుడు : విజయ సింహారెడ్డి ( భక్త సిరియాల్) ఉత్తమ బాల నటి : ప్రణవి ( ఉయ్యాల జంపాల) ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత : మేర్లపాక గాంధీ (వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్) ఉత్తమ కథా రచయిత : ఇంద్రగంటి మోహనకృష్ణ ( అంతుకు ముందు ఆ తరువాత) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : మురళీమోహన్ రెడ్డి (కమలతో నా ప్రయాణం) ఉత్తమ కళాదర్శకుడు : ఏ ఎస్ ప్రకాష్ (మిర్చి) ఉత్తమ కొరియోగ్రాఫర్ : శేఖర్ వీజే (గుండెజారి గల్లంతయ్యిందే) ఉత్తమ ఆడియోగ్రాఫర్ : ఇ రాధాకృష్ణ ( బసంతి) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : తిరుమల ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : శివ కుమార్ ( శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య) ఉత్తమ ఫైట్ మాస్టర్ : వెంకట్ నాగ్( కాళీచరణ్ ) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : పీజే రవి ( బొమన్ ఇరానీ, అత్తారింటికి దారేది) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫీ మేల్ : మిత్రా వరుణ మహి (ఉయ్యాల జంపాల) ఉత్తమ విజువల ఎఫెక్ట్స్ : యతిరాజ్ ( సాహసం ) -
జాతీయాలు
ఈగకు పోక పెట్టినట్లు! అన్ని పనులూ అందరూ చేయలేరు. ఒక్కో పనిలో ఒకరు నిష్ణాతులై ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే...పని బాధ్యతలు అప్పగించే సమయంలో వారి సమర్థతను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే... పనిలో చాలా తేడా వస్తుంది. అలాగే ఇష్టాల్లో కూడా ఒకరికి ఒక రకం ఇష్టాలు ఉంటే, మరొకరికి మరోరకం ఇష్టాలు ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉపయోగించే మాటే... ‘ఈగకు పోక పెట్టినట్లు’ ఈగకు బెల్లం అంటే ఇష్టం. ఇంకా రకరకాల మిఠాయిలు అంటే ఇష్టం. మరి ఈగకు మిఠాయి కాకుండా పోక పెడితే?! హాస్యాస్పదంగా ఉంటుంది కదా! కందాల రాజు వెనకటికి జమీందారుల ఇండ్లల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ల కోసం, అతిథుల కోసం భోజనశాల ఉండేది. బయటి నుంచి వచ్చిన వారు అందులోకి వెళ్లి భోజనం చేయవచ్చు. ఎవరి అనుమతీ అక్కర్లేదు. ‘మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు?’ అని అడిగేవారు ఉండరు. ఈ భోజనశాలలో పెట్టే భోజనానికి కందా అని పేరు. ఈ భోజనశాలలో తిని వెళ్లేవాళ్లను ‘కందాల రాజు’ అని వ్యంగ్యంగా అనేవాళ్లు. పెద్ద మనిషి హోదాలో కనిపిస్తూ తేరగా ఎక్కడ భోజనం దొరికినా తినేవాళ్లను కందాల రాజు అంటారు. ‘ఆయన సంగతి నాకు తెలియదా ఏమిటి? కందాల రాజు. జేబు నుంచి చిల్లిగవ్వ కూడా తీయడు’ ‘మా ఇంటికొచ్చే కందాల రాజుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది’ ఇలా వివిధ సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. కాకః కాకః పికః పికః ఒకరిలో ఉన్న సమర్థత, ప్రతిభ ఇతరులలో ఉండకపోవచ్చు. లేదు కదా... అని ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవచ్చు. అనుకరించాలని ప్రయత్నించే వాళ్లు అపహాస్యం పాలు కావచ్చు. వెనకటికి ఒక కాకి కోకిలను అనుకరించబోయి నవ్వులపాలైందట. తమ సహజత్వాన్ని మరచి గొప్పల కోసం, పేరు ప్రతిష్ఠల కోసం ఇతరులను అనుకరించేవాళ్లను దృష్టిలో పెట్టుకొని ఉపయోగించే జాతీయం ఇది. ఉదా: ఎవరి స్వభావానికి తగ్గట్టు వారు ఉంటే మంచిది. లేకుంటే అభాసుపాలవుతాం. కాకః కాకః పికః పిక: అనే సత్యాన్ని మరచిపోవద్దు. గుండ్లు తేలి బెండ్లు మునిగినట్లు! అనుకున్నది ఒకటి అయినదొకటి అయినప్పుడు, విషయాలు తారుమారైనప్పుడు, ఊహించని చిత్రాలు జరిగినప్పుడు... ఉపయోగించే మాట ఇది. నీళ్లలో ఇనుపగుండ్లు మునగడం... బెండ్లు తేలడం సాధారణం. అలా కాకుండా... బెండ్లు మునిగి, గుండ్లు తేలితే? అది నమ్మశక్యం కాని విషయం. అసాధ్యం అనుకున్న విషయం సాధ్యం అయినప్పుడు, ఊహించిన విధంగా పరిస్థితి తారుమారైన సందర్భాల్లో ఉపయోగించే జాతీయం ఇది. ఉదా: ‘అందరూ అప్పారావే గెలుస్తారనుకున్నారు. చిత్రంగా సుబ్బారావు గెలిచాడు. గుండ్లు తేలి బెండ్లు మునగడం అంటే ఇదేనేమో!’ -
పంది పిల్లతో రవిబాబు సినిమా
అల్లరి, అవును, అనసూయ, లడ్డూ బాబు లాంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవిబాబు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా సినిమాలు చేసే రవిబాబు. ఇప్పుడు మరో ప్రయోగం చేస్తున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి ఈగ ప్రధాన పాత్రలో సినిమాను తెరకెక్కిస్తే క్రియేటివ్ డైరెక్టర్ రవిబాబు ఓ పంది పిల్ల ప్రధాన పాత్రగా సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పూర్తిగా పంది పిల్ల చుట్టూ తిరిగే కథతో రూపొందుతున్న ఈ సినిమాతో అభిషేక్, నబా హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఎక్కువగా యానిమేషన్ గ్రాఫిక్స్‌తో రూపొందిస్తున్న ఈ సినిమాకు సురేష్ బాబు నిర్మాత. ఈ సినిమాలో పంది పిల్లను గ్రాఫిక్స్‌లో క్రియేట్ చేయటం కోసం దాదాపుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. -
ఆస్ట్రేలియా బొద్దింక, అమెరికా తేనెటీగ... ఇండియా ఈగ
ఆ సీన్ - ఈ సీన్ దర్శకుడు రాజమౌళి సినిమాలు ఇప్పుడు హాలీవుడ్‌కు దీటైనవనే ప్రశంసలు పొందుతున్నాయి. ప్రత్యేకించి ‘బాహుబలి’ సినిమాతో ఇండియా లెవెల్లో సరికొత్త రికార్డులు సృష్టించాడు ఈ దర్శక మాంత్రికుడు. అయితే తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళుతున్న ఈ దర్శకుడి సినిమాల్లో హాలీవుడ్ ఛాయలు సుస్పష్టంగా కనిపించడం కాస్త ఆశ్చర్య పరిచే విషయమే. యాదృచ్ఛికం అనుకోవచ్చునేమో కానీ... సామీప్యత ఎక్కువగా ఉండటంతో రాజమౌళి సినిమాలు అప్పుడప్పుడూ కాపీ క్యాట్స్ అనిపించుకుంటూ ఉంటాయి. అలాంటి వాటిలో ‘ఈగ’ ఒకటి. సమంత, నాని, సుదీప్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించేది ‘ఈగ’. ఆ ఈగ విన్యాసాలు ఈ సినిమా రాకముందే కొన్ని విదేశీ సినిమాల్లో ఆవిష్కృతం అయ్యాయి. దీంతో ‘ఈగ’ సినిమాలోని సీన్లు కాపీ అనే వాదన ఉంది. తెలుగు తెరపై వచ్చిన గేమ్ చేంజింగ్ మూవీస్‌లో ‘ఈగ’ ఒకటి. ప్రత్యేకించి చిన్న పిల్లలను బాగా ఆకట్టుకున్న ఈ సినిమా కథలో ఒక ఆస్ట్రేలియన్ సినిమా ఛాయలు కనిపిస్తాయి. 2010లో వచ్చిన ఆ సినిమా పేరు ‘కాక్రోచ్’. ‘ఈగ’ 2012లో విడుదల అయ్యింది. ఇందులో చనిపోయిన హీరో ‘ఈగ’గా పుడితే, ‘కాక్రోచ్’లో హీరో బొద్దింక’గా వస్తాడు. తెలుగు వెర్షన్లో సమంతను ప్రేమిస్తున్న నాని రోల్‌ను సుదీప్ పాత్ర చంపేస్తుంది. చనిపోయిన అతడు ఈగగా మరుజన్మ ఎత్తుతాడు. ఈగ జీవితకాలం అతి తక్కువ రోజులే. ఆ కొద్ది రోజుల్లోనే అది తన ప్రియురాలిని ఎలా చేరుకుంది, విలన్ బారి నుంచి తనను ఎలా కాపాడుకుంది, విలన్‌ను ఎలా అంతమొందించింది అనేది కథ. అయితే ‘కాక్రోచ్’లో హీరో, హీరోయిన్లిద్దరికీ పెళ్లి అవుతుంది. హనీమూన్‌కి వెళుతున్నప్పుడు జరిగే యాక్సిడెంట్లో హీరో చార్లీ చనిపోతాడు. తర్వాత ఒక బొద్దింకగా జన్మించి ఒంటరిగా విషాదంలో ఉన్న తన భార్య చుట్టూ తిరుగుతుంటాడు. ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు కూడా ఈగ సినిమాలో కనిపిస్తాయి. ‘ఈగ’ సినిమాలో సమంతకు తను నానీని అని అర్థమయ్యేలా చేయడానికి ఈగ చేసే యత్నాలన్నీ ‘కాక్రోచ్’లో కనిపిస్తాయి. తేమతో ‘నాని’ అని రాసి ఈగ తన ప్రియురాలికి తన గురించి అర్థమయ్యేలా చేస్తే, ‘కాక్రోచ్’లో బొద్దింక రాళ్లను పేర్చి ‘చార్లీ’ అని ఇంగ్లిష్‌లో రాస్తుంది! తెలుగు సినిమాలో ప్రత్యేకంగా విలన్ ఉంటాడు. అయితే ఆస్ట్రేలియన్ సినిమాలో విధే వారి పాలిట విలన్. కథాంశం పరంగా ‘కాక్రోచ్’తో పోలికలు ఉన్న ‘ఈగ’ సినిమాలో కొన్ని సీన్లు హాలీవుడ్ యానిమేటెడ్ సినిమా ‘ద బీ’ స్ఫూర్తితో రూపొందించారేమో అనిపిస్తుంది. ఆ యానిమేటెడ్ మూవీలో తేనెటీగది ప్రధాన పాత్ర. ఈగ సినిమాలో సుదీప్ కారులోకి ఈగ ప్రవేశించే సన్నివేశం ‘బీ’ సినిమాలో కనిపిస్తుంది. ఒక క్రికెట్ బాల్‌పై వాలిన ఈగ ఆ బంతి గాల్లోకి లేచినప్పుడు ఎగిరి, అదే వేగంతో కారు ఇంజిన్లోకి ప్రవేశించి... డ్రైవింగ్ సీట్లో ఉన్న సుదీప్‌కు ‘హాయ్’ చెబుతుంది. యానిమేటెడ్ సినిమాలో తేనెటీగ ఒక టెన్నిస్ బంతిపై వాలి, ఆటగాళ్లు దాన్ని గాల్లోకి కొట్టినప్పుడు విసురుగా ఒక కారు ఇంజిన్లోకి దూసుకుపోయి, అటు నుంచి కారులోకి ప్రవేశించి కారులోని ఫ్యామిలీకి ‘హాయ్’ చెబుతుంది. దాదాపు సేమ్ సీన్ కదా! అయితే ‘ద బీ’ సినిమాకి, ‘ఈగ’ సినిమాకి కథాంశం పరంగా ఎలాంటి సంబంధమూ ఉండదు. కానీ అదే సినిమా లోని మరో సీన్ కూడా ఈగలో కని పిస్తుంది. ‘ఈగ’ రూపంలో ఉన్నది నాని అని గుర్తించాక సమంత తనతో సరదాగా గడుపుతుంది. ఆ క్రమంలో వాళ్లిద్దరూ కాఫీ తాగే సీన్ ఒకటుంది. ఇదే సీన్ ‘ద బీ’ లోనూ ఉంటుంది. ఓ కుటుంబంతో తేనెటీగకు స్నేహం కుదిరాక అది వారితో సరదాగా మెలుగుతూ ఉంటుంది. ఇంటి యజమానురాలితో కలిసి అది కాఫీ తాగడం, ఆమె దానితో సంభాషించడం, ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఆమె ఎవరితో మాట్లాడుతోందో అర్థం కాక గాభరా పడటం... ఈ సీన్ మొత్తం ‘ద బీ’లో ఉంటుంది. ‘ఈగ’లో తాగుబోతు రమేశ్ అలాగే కన్ఫ్యూజ్ అవడం గుర్తుంది కదా! ఈ విధంగా ‘ఈగ’లో కొన్ని సినిమాల్లోని సన్నివేశాలు దర్శనమిస్తాయి. అయితే మనకు ఇవన్నీ కాపీ అనిపిస్తే, కేవలం యాదృచ్ఛికం అనేది ‘ఈగ’ రూపకర్తల వాదన! - బి.జీవన్‌రెడ్డి -
ఈగకు థ్యాంక్స్: రాజమౌళి
నెల రోజుల అమెరికా టూర్ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి ఇండియా తిరిగొచ్చారు. ఫ్యామిలీతో సరదాగా గడపడంతో పాటు, దక్షిణ కొరియా, బుసాన్‌లో జరుగుతున్న బుసాన్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేందుకు రాజమౌళి అమెరికా వెళ్లారు. తిరిగి వచ్చిన ఆయన టూర్ విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫెస్టివల్లో 'బాహుబలి - ది బిగినింగ్' సినిమా ప్రదర్శించిన తరువాత తనను 'ఈగ' దర్శకుడిగా పరిచయం చేశారని తెలిపారు. 2012లో అదే ఫెస్టివల్లో 'ఈగ' సినిమాను ప్రదర్శించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకున్నారన్నారు. బాహుబలి స్క్రీనింగ్ పూర్తయిన తరువాత అక్కడి సినీ అభిమానులు ఈగ డీవీడీలపై రాజమౌళి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఈ విషయంలో రాజమౌళి ట్విట్టర్ లో తెలిపారు. తన కెరీర్ కు ఎంతో ఉపయోగపడిన ఈగకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేశారు. ప్రభాస్, రానాలు లీడ్ రోల్స్‌లో నటించిన 'బాహుబలి - ది బిగినింగ్' బుసాన్ ఫెస్టివల్ లో మూడు సార్లు ప్రదర్శించనున్నారు. ఇప్పటికే ఈ నెల 4న ఒకసారి ప్రదర్శించగా, 7, 9 తేదిలలోనూ ప్రదర్శించనున్నారు. దాదాపు 5000 మంది ప్రేక్షకులు ఒకేసారి చూసేందుకు వీలున్న అవుట్ డోర్ ఆడిటోరియంలో ఈ స్పెషల్షోను ఏర్పాటు చేశారు. Back in india after a month long tour in U.S. , Bali and South Korea..few days spent on work and few days spent on holiday..refreshing.. — rajamouli ss (@ssrajamouli) October 6, 2015 After the screening in Busan I mentioned I was the director of EEGA which screened there in 2012. There were so many oohs and aahs from the — rajamouli ss (@ssrajamouli) October 6, 2015 Audience. Many Koreans took my autograph on the dvd cover of EEGA... That film did so much to my career...thanks EEGA...:) — rajamouli ss (@ssrajamouli) October 6, 2015 Baahubali will be screened three times and this is the 5000 capacity outdoor auditorium that will play it on 7th.. pic.twitter.com/SvZhRLjdT6 — rajamouli ss (@ssrajamouli) October 6, 2015 -
‘ఈగ’ స్ఫూర్తితో...
రాజమౌళి ‘ఈగ’ సినిమా స్ఫూర్తితో లైవ్ విత్ కంప్యూటర్ గ్రాఫిక్స్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘మనీ ప్లాంట్’. వెంకట్ గోపు దర్శకత్వంలో గణేశ్ కొల్లూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యువత, రక్తచరిత్ర, బ్యాక్‌బెంచ్ స్టూడెంట్ చిత్రాల్లో నటించిన రుద్రాక్ష్ఇందులో కథానాయకుడు. ముహూర్తపు దృశ్యానికి నటుడు కృష్ణుడు కెమెరా స్విచాన్ చేయగా, దర్శక నిర్మాత ‘మధుర’ శ్రీధర్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత రాజ్ కందుకూరి గౌరవ దర్శకత్వం వహించారు. లవ్, కామెడీ కలగలిసిన సైన్స్ ఫిక్షన్ మర్డర్ థ్రిల్లర్ ఇదని దర్శకుడు పేర్కొన్నారు. జనవరి మూడోవారంలో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హనుమాన్, కెమెరా: ప్రసాద్ జి.కె. -
బొమ్మాళీ కథలు
-
మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే!
‘‘నేను, నాది అనే స్వార్థంలో ఆనందం లభించదు. ‘మనం’ అనే ఫీలింగ్‌లో ఎంతో హాయి ఉంటుంది’’ అంటున్నారు సమంత. అందం, అభినయం రెండూ సొంతం చేసుకున్నారు కాబట్టే.. తక్కువ సమయంలో ‘స్టార్ హీరోయిన్’ అయ్యారామె. అయితే, ఇదంతా పూర్తిగా తన క్రెడిట్ మాత్రమే కాదంటూ- ‘‘మామూలు ఆర్టిస్ట్‌ని ‘స్టార్’ని చేసేది వాళ్లు పోషించే పాత్రలు. నిరూపించుకోదగ్గ పాత్రలు చేసి, మంచి సక్సెస్‌లు చేజిక్కించుకుని ‘స్టార్’ అవుతాం. కానీ, ఆ స్టార్ హోదా అలా కొనసాగాలంటే ప్రేక్షకుల అభిమానం ఎంతో ముఖ్యం. వాళ్లు అభిమానించకపోతే ‘స్టార్’ అనిపించుకోలేం. ఇక, సినిమా పరిశ్రమ గురించి చెప్పాలంటే, చాలా విచిత్రమైంది. ఇవాళ నువ్వు ఏమీ కావు.. కానీ ఒక్క సక్సెస్ వచ్చిందంటే చాలు, రేపటికల్లా సూపర్ స్టార్ అయిపోతావ్. మేజిక్ అంతా ఒక్క సినిమాతోనే జరిగిపోతుంది. ‘ఏ మాయ చేశావె’తో నా అందం, అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ‘ఈగ’ తర్వాత పెద్ద సంస్థల్లో చేసే అవకాశం వస్తోంది. అందుకే చెబుతున్నా... ఒక్క సినిమా జీవితాన్ని మార్చేస్తుందని. ఒకవేళ టైమ్ బాగాలేదనుకోండి... ఆ ఒక్క సినిమానే జీవితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే జయాపజయాలకు సమానంగా స్పందిస్తూ వెళ్లిపోవాలి. సక్సెస్‌ని నెత్తికెక్కించుకుంటే కష్టం. అలాగే ‘నా జీవితం.. నా ఆనందం’ అని కాకుండా ఇతరులకు కూడా సహాయపడితే అప్పుడు నిజమైన ఆనందాన్ని చవిచూడొచ్చు’’ అన్నారు సమంత. -
'ఈగ'కు 9 అంతర్జాతీయ అవార్డులు
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఈగ' సంచలనాల పరంపర కొనసాగుతోంది. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ప్రేక్షకులతో ప్రసంశలతో పాటు అంతర్జాతీయ పురస్కారాలను అందుకుంటోంది. ఇటీవల జరిగిన 8వ టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో 'ఈగ' సత్తా చాటింది. 9 అవార్డులు దక్కించుకుంది. బెస్ట్ ఫైట్ విభాగంలోనూ ఈ సినిమాకు అవార్డు రావడం విశేషం. ఈ సినిమాలో హీరో నాని, విలన్ సుదీప్ మధ్య పోరాట సన్నివేశాలే లేవు. కాని సుదీప్‌పై ఈగ చేసిన పోరాటాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ప్రజాదరణ పొందిన చిత్రంతో పాటు యాక్షన్ ఫిల్మ్, కామెడీ, మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్, స్పెషల్ ఎఫెక్ట్స్ , ఫైట్స్, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులు సాధించింది. ఉత్తమ విలన్(సుదీప్), ఉత్తమ హీరో(ఈగ/నాని) పురస్కారాలు దక్కించుకుంది. రెండు జాతీయ అవార్డు దక్కించుకున్న పలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లోనూ ప్రదర్శితమయింది. -
వారాహి వారి రెండు సినిమాలు
‘ఈగ’, ‘అందాల రాక్షసి’ నిర్మాత సాయి కొర్రపాటి ఒకేసారి రెండు చిత్రాలను నిర్మించబోతున్నారు. ఓ చిత్రం ద్వారా నటుడు అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయం అవుతుండగా, మరో చిత్రానికి గోగినేని శ్రీనివాస్ దర్శకుడు. ఈ చిత్రాల పూజాకార్యక్రమాలు వారాహి సంస్థ కార్యాలయంలో జరిగాయి. అవసరాల శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్న చిత్రంలో నాగశౌర్య హీరోగా నటించనున్నారు. కల్యాణ్ కోడూరి సంగీత దర్శకుడు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని అవసరాల శ్రీనివాస్ చెప్పారు. గోగినేని శ్రీనివాస్ దర్శకత్వం వహించే చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని, ఈ చిత్రానికి సిల్లీ మాంక్స్ సినిమా సంస్థ సహ నిర్మాతగా వ్యవహరిస్తుందని నిర్మాత సాయి కొర్రపాటి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎస్.రాజమౌళి, ఎం.ఎం.కీరవాణి కుటుంబసభ్యులు, సిల్లీ మాంక్స్ సినిమా సీఈఓ సంజయ్‌రెడ్డి పాల్గొన్నారు.