
‘నేను ట్రెండ్ ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తా’అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రస్తుతం ఆ డైలాగ్‌నే అక్షరాల ఫాలో అవుతున్నాడు పవన్ వీరాభిమాని యంగ్ హీరో నితిన్. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వెండితెర ‘భీష్మ’గా నితిన్ రాబోతున్న విషయం తెలిసిందే. రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. దీపావళి కానుకగా ఇచ్చిన సడెన్ సరైప్రైజ్ నుంచి ప్రేక్షకులు తేరుకోకముందే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బర్త్‌డే రోజు ‘భీష్మ’ ఫస్ట్ గ్లింప్స్ పేరిట చిన్న టీజర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
31 సెకన్ల పాటు సాగే ఫస్ట్ గ్లింప్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ట్రెండింగ్‌లో టాప్ ప్లేస్‌లో ఉన్న ‘భీష్మ’ఫస్ట్ గ్లింప్స్, ఇప్పటికే మూడు మిలియన్ వ్యూస్‌ను రాబట్టడం విశేషం. రష్మికా క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో పాటు నడుము సీన్, నితిన్ యాటిట్యూడ్ యూత్‌కు భాగా కనెక్ట్ అయ్యేలా చేసాయి. ఇక ‘బీష్మ’ వచ్చే ఏడాది పిబ్రవరిలో రిలీజ్ కానుండటంతో 2019లో నితిన్ సినిమా ఒక్కటి కూడా విడుదల కాదని తేలిపోయింది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment