హీరో నితిన్‌ పెళ్లి వాయిదా..!  | Nithin And Shalini Wedding Date Postponed To May | Sakshi
Sakshi News home page

హీరో నితిన్‌ పెళ్లి వాయిదా..! 

Published Sat, Feb 8 2020 3:24 PM | Last Updated on Sat, Feb 8 2020 3:31 PM

Nithin And Shalini Wedding Date Postponed To May - Sakshi

సాక్షి, హైదాబాద్‌ : టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌  నితిన్‌ పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. షాలిని అనే అమ్మాయిని నితిన్‌ గత నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని నితిన్‌ ఇంట్లో చెప్పేయడంతో వారూ ఒప్పుకున్నారు. ఇక నితిన్‌ పెళ్లి ఈ ఏడాది ఏప్రిల్‌ 15న జరుగుతుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య దుబాయ్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకోబోతున్నారనే పుకార్లు టాలీవుడ్‌లో చక్కర్లు కొట్టాయి. అయితే పెళ్లి వాయిదా పడిందని తాజా సమాచారం. పెళ్లి ఏప్రిల్‌లో కాకుండా మేలో పెట్టుకుందామని నితిన్ ఇంట్లో వారితో చెప్పినట్లు తెలుస్తోంది. వరుస సినిమాల వల్ల నితిన్‌ ఏప్రిల్‌లో పెళ్లి చేసుకోలేకపోతున్నారని తెలిసింది.

 ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాతో బాగా బిజీగా ఉన్నారు. వెంకీ కుడుముల సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన కథానాయికగా నటించారు. 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు‌. ఈ సినిమా తరువాత విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ ఏలేటి, దర్శకుడిగా మారిన లిరిసిస్ట్‌ కృష్ణ చైతన్యల దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు అంగీకరించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement