
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ ఎంత ప్రయత్నించినా సరైన గాడిలో పడటం లేదు. హిట్ కోసం విక్రమార్కుడిలా వరుస ప్రయత్నాలు చేసిన నితిన్ ఇష్క్ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. ఒకటి రెండు సినిమాలతో పరవాలేదనిపించినా తరువాత వరుస ఫ్లాప్‌లు పలకరించాయి.
దీంతో ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో శ్రీనివాస కల్యాణం సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు 10 నెలల విరామం తరువాత తిరిగి కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన నితిన్, బుధవారం నుంచి ఆ ప్రాజెక్ట్‌ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు.
నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భీష్మా అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రీ లుక్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో మూవీపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment