టీజర్‌ గురించి నితిన్‌ ఏమన్నాడంటే? | Nithin Bheeshma Telugu Movie Teaser Date Fix | Sakshi
Sakshi News home page

‘భీష్మ’నుంచి మరో అప్‌డేట్‌!

Published Fri, Jan 10 2020 6:05 PM | Last Updated on Fri, Jan 10 2020 6:05 PM

Nithin Bheeshma Telugu Movie Teaser Date Fix - Sakshi

యంగ్‌ హీరో నితిన్‌, క్యూట్‌ హీరోయిన్‌ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌, సింగిల్‌ ఆంథమ్‌ సాంగ్‌లతో సినిమాపై పాజిటివ్‌ బజ్‌ క్రియేట్‌ అయింది. తాజాగా ‘భీష్మ’ అభిమానులకు చిత్ర యూనిట్‌ లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఓ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఈ చిత్ర టీజర్‌ను జనవరి 12న(ఆదివారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ‘ఏ ఫన్‌ టీజర్‌ ఆన్‌ యువర్‌ వే’ అంటూ నితిన్‌ ట్వీట్‌ చేశాడు. 

రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌గా తెరకుక్కుతున్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టు మూవీ ప్రమోషన్‌లో భాగంగా నితిన్‌, రష్మికలతో డిఫరెంట్‌ వీడియోలను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వీడియోలకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. పాటలు మినహా మిగతా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్న ఈ చిత్రాన్ని  వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల కానుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement