'డబ్బు లేకపోవడం వల్లే...' | Nithin-Puri film was dropped due to lack of money, not me | Sakshi
Sakshi News home page

'డబ్బు లేకపోవడం వల్లే...'

Published Mon, Jun 15 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:47 AM

'డబ్బు లేకపోవడం వల్లే...'

'డబ్బు లేకపోవడం వల్లే...'

పూరి జగన్నాథ్-నితిన్ సినిమా డబ్బు లేకపోవడం వల్లే ఆగిపోయిందని, తనవల్ల కాదని నటి చార్మి స్పష్టం చేసింది. అనవసరంగా తనను వివాదంలోకి లాగారని ఆమె వాపోయింది. ఈ సినిమా నిర్మాతలు అక్కినేని అఖిల్ మొదటి చిత్రానికి పెట్టుబడి పెట్టినందున పూరి జగన్నాథ్ తో సినిమా తీసేందుకు వెనుకడుగు వేశారని తెలిపింది. అందువల్లే పూరి జగన్నాథ్ మరో హీరో, నిర్మాతలతో ఈ సినిమా తీస్తున్నారని వెల్లడించింది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని పేర్కొంది.

మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని చార్మి ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది మగాళ్లు చాలా ఈజీగా మహిళలపై బురద చల్లుతుంటారని పేర్కొంది. ఇలాంటి వాళ్లు తమ అహంకారం వీడనాడి వాస్తవ పరిస్థితులను గమనించాలని సూచించింది. పురుషాధిక్య సినిమా పరిశ్రమలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో 'జ్యోతిలక్ష్మి' సినిమాను చార్మి నిర్మించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement