charmme
-
ముంబైలో పూరీని చూసి ఎమోషనల్ అయిన ఫ్యాన్.. వీడియో వైరల్
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. ఈ తరుణంలో ముంబైలోని రద్దీ రోడ్లపై పూరీని చూసి ఏమోషనల్ అయ్యాడు ఓ ఫ్యాన్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముంబైలో ఇంటర్ చదువుతున్న ఓ తెలుగు కుర్రాడు కారులో వెళుతున్న పూరీతో మాట్లాడాడు. అతని పేరు ప్రమోద్ అని, మీకు పెద్ద ఫ్యాన్‌ని అంటూ ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కారుపై టీఎస్ నెంబర్ ప్లేట్ చూసి తెలుగు అనుకున్న కానీ డైరెక్టర్ని చూసి షాక్ అయినట్లు తెలిపాడు. సెల్ఫీ తీసుకోవాలను ఉందని, కానీ ఫోన్ లేకపోవడంతో కుదరట్లేదని ఎమోషనల్ అయ్యాడు. కారులో ఉన్న చార్మీ వీడియో తీస్తున్నట్లు గుర్తించి ట్విట్టర్లో అప్లోడ్ చేయండి మేడమ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఫోన్ లేకపోవడంతో సెల్పీ తీసుకోలేక పోయిన ఆ అభిమాని కోసం ఆమె సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది. చదవండి: ఆకాశ్‌లో ఆ కసి కనిపించింది This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH — Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021 -
రవితేజపై సిట్ ప్రశ్నల వర్షం!
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో విచారణకు హాజరైన హీరో రవితేజకు సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్, జీశాన్‌తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవితేజ సోదరులు డ్రగ్స్ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సిట్ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ‘మీ సోదరులతో మీకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్, జీశాన్ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్‌తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. మీ రక్త నమూనాలు తీసుకోవచ్చా?.’ అంటూ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం. కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న రవితేజ శుక్రవారం ఉదయం విచారణ నిమిత్తం సిట్ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్ విచారణ చేసింది. ఈ కేసుల్లో నోటీసులు జారీ చేసిన వారిని వరుసగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటివరకూ సిట్ అధికారులు 19మందిని అరెస్ట్ చేశారు. కాగా మైక్ కమింగతో లింకులు ఉన్న మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. -
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
-
సిట్ విచారణకు హాజరైన హీరో రవితేజ
హైదరాబాద్ : ప్రముఖ హీరో రవితేజ శుక్రవారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న ఆయన ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకున్న రవితేజ సిట్ విచారణకు వచ్చారు. రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్ సరఫరా చేసినట్లు డ్రగ్స్ మాఫియా కేసులో నిందితుడు జీశాన్ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ఆరా తీయనున్నారు. అలాగే కెల్విన్, జీశాన్‌తో గల సంబంధాలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. మరోవైపు హీరో రవితేజను చూసేందుకు సిట్ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను సిట్ అధికారులు ప్రశ్నించారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు, నటుడు సుబ్బరాజు, హీరోలు తరుణ్, నవదీప్, సినీనటి చార్మీ, ముమైత్ ఖాన్ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఇక తన కుమారుడికి డ్రగ్స్ వాడే అలవాటే లేదని, ఆయన తల్లి రాజ్యలక్ష్మి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
-
విచారణకు హాజరైన ముమైత్ ఖాన్
హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి ముమైత్ ఖాన్ గురువారం సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ నుంచి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ముమైత్ వెంట బిగ్ బాస్ షో నిర్వాహకులు కూడా సిట్ కార్యాలయానికి వచ్చారు. కాగా పూణెలో జరుగుతున్న బిగ్ బాస్ షో లో పాల్గొంటున్న ఆమె...షో నుంచి అనుమతి తీసుకుని బుధవారం రాత్రే హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ముమైత్ ఎయిర్‌పోర్టులో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా ముఖానికి జర్కిన్ అడ్డుపెట్టుకొని మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. కాగా సరైన చిరునామా దొరకకపోవడంతో సిట్ అధికారులు ఆమెకు ఆలస్యంగా నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, చార్మీలను ప్రశ్నించిన సిట్... ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై ఆరా తీసింది. శుక్రవారం హీరో రవితేజను సిట్ అధికారులు విచారణ చేయనున్నారు. -
సిట్ ఎదుట చార్మి.. ఆరు గంటలు!
-
సిట్ ఎదుట చార్మి.. ఆరు గంటలు!
హైకోర్టు ఆదేశాలతో ఐదులోపే ముగిసిన విచారణ హైదరాబాద్: టాలీవుడ్‌ను కుదుపుతున్న డ్రగ్స్ కేసులో హీరోయిన్ చార్మిపై సిట్ విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటలపాటు సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. నలుగురు మహిళా అధికారుల బృందం ఆమెకు ప్రశ్నలను సంధించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఐదుగంటలలోపే చార్మిపై సిట్ విచారణ ముగిసింది. చార్మి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న సిట్ అధికారులు.. మరోసారి పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. విచారణ సందర్భంగా ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. విచారణ అనంతరం ఉల్లాసంగా మీడియాకు చేతులు ఊపుతూ చార్మి వెళ్లిపోవడం గమనార్హం. ప్రధానం డ్రగ్స్ ముఠా సభ్యుడు కెల్విన్‌తో సంబంధాలపైనే చార్మిని సిట్ ప్రశ్నించినట్టు సమాచారం. కెల్విన్‌తో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? మీరు డ్రగ్స్ తీసుకుంటురా? పబ్‌లకు వెళుతారా? పబ్‌ల్లో డ్రగ్స్ సంస్కృతిపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్లో డ్రగ్స్ అలవాటు ఎవరెవరికి ఉంది? తదితర ప్రశ్నలను సిట్ అధికారులు చార్మికి వేసినట్టు తెలుస్తోంది. టాలీవుడ్ సినీ ప్రముఖులతో సంబంధాల గురించి కూడా ఆరాతీసినట్టు సమాచారం. ప్రధానంగా సాక్షిగా భావించి చార్మిని విచారిస్తున్నామని సిట్ ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసింది. చార్మిని ప్రధానంగా కెల్విన్ గురించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చార్మి హీరోయిన్గా తెరకెక్కిన 'జ్యోతిలక్ష్మి' సినిమా వేడుకలో కెల్విన్ పాల్గొన్న ఫొటోలను చూపించి.. ఆమెను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. చట్టప్రకారం నిబంధనలను అనుసరించే హీరోయిన్ చార్మి కౌర్‌ను విచారించాలని ఎక్సైజ్ సిట్ అధికారులను హైకోర్టు ఆదేశిం చిన సంగతి తెలిసిందే. చార్మి ఇష్టానికి విరుద్ధంగా ఆమె రక్తం, వెంట్రుకలు, గోళ్ల నమూనాలను సేకరించవద్దని.. ఈ విషయంలో ఆమెపై ఒత్తిడి చేయవద్దని సూచించింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య, మహిళా అధికారుల సమక్షంలో మాత్రమే ప్రశ్నించాలని పేర్కొంది. విచారణ పూర్తికాకుంటే మరుసటి రోజు కొనసాగించవచ్చని సూచించింది. అంతకుముందు చార్మి తరఫున న్యాయవాది పి.విష్ణువర్ధన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సిట్ అధికారులు విచారణకు పిలిచిన వారినుంచి బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలు సేకరిస్తున్నారని న్యాయమూర్తి దృష్టికి తీసుకువచ్చారు. చార్మి విషయంలోనూ అలాగే జరిగే అవకాశముందని.. ఇది హక్కు లను ఉల్లంఘించడమేనన్నారు. దీనికి సిట్ తరఫు లాయర్ బదులిస్తూ సిట్ అధికారులు ఎవరి నుంచీ బలవంతంగా రక్తం, గోళ్లు, వెంట్రుకల నమూనాలను తీసుకోవడం లేదని తెలిపారు. -
ఎక్సైజ్ కానిస్టేబుల్ పై చార్మీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై సినీనటి చార్మీ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం విచారణకు సిట్ కార్యాలయానికి వచ్చిన తనపట్ల కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ విచారణ నిమిత్తం ఇవాళ అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. అప్పుడు లోనికి వెళ్లే సమయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ తనను తాకుతూ శ్రీనివాస్ అత్యుత్సాహం ప్రదర్శించాడని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను ఒక్కసారిగా తాను షాక్‌కు గురైనట్లు చార్మి వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు చార్మీని నలుగురు మహిళా అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఎలా పరిచయం అనేవాటిపై ప్రశ్నిస్తున్నారు. -
సిట్ విచారణకు హీరోయిన్ చార్మీ
-
సిట్ విచారణకు హీరోయిన్ చార్మీ
హైదరాబాద్ : డ్రగ్స్ మాఫియా కేసులో సిట్ అధికారుల విచారణ ఏడో రోజు కొనసాగుతోంది. ఈ కేసులో నోటీసులు అందుకున్న సినీనటి చార్మి విచారణ నిమిత్తం బుధవారం సిట్ అధికారుల ఎదుట హాజరయ్యారు. నలుగురు బౌన్సర్ల భద్రత మధ్య చార్మీ సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ఆమె కొండాపూర్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో పైసా వసూలు సినిమా షూటింగ్లో పాల్గొని అక్కడ నుంచే నేరుగా నాంపల్లిలోని అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పైసా వసూలు చిత్రానికి చార్మీ లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె ఇటీవలే పూరీ జగన్నాథ్‌తో కలిసి ‘పూరీ కనెక్ట్’ పేరుతో ఓ చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కాగా చార్మిని హైకోర్టు ఆదేశాలతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం అయిదు గంటల వరకూ విచారణ చేయనున్నారు. ఒకవేళ హైకోర్టు ఇచ్చిన సమయంలో విచారణ పూర్తి కాకుంటే ఆమెను రేపు (గురువారం) కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. డ్రగ్స్ ముఠాతో పాటు, సినీ ప్రముఖులతో సంబంధాలపై మహిళా అధికారుల బృందం ఆమెను విచారణ చేయనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే నోటీసులు అందుకున్న పలువురు సినీ ప్రముఖులు సిట్ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. దర్శకుడు పూరీ జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్, నవదీప్, ఆర్ట్ డైరెక్టర్ చిన్నాలను సిట్ అధికారులు విచారణ చేశారు. -
ఈ హీరోయిన్ 'లిమిటెడ్ ఎడిషన'ట..!
హీరోయిన్ చార్మీ ఇప్పుడు వెండితెర మీద కనిపించటం తగ్గించేసినా.. సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేసేస్తోంది. దర్శకుడు పూరి జగన్నాథ్ ఏర్పాటు చేసిన పూరి కనెక్ట్ బాధ్యతలు చూస్తున్న ఈ బ్యూటి, పూరి సినిమా షూటింగ్ లలోనూ హడావిడి చేస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్, బాలకృష్ణల కాంబినేషన్ లోరూపొందుతున్ పైసా వసూల్ షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. ప్రస్తుతం పూరీ టీంతో కలిసి పోర్చుగల్ లో ఉన్న చార్మీ తన చేతిమీద టాటూ వేయించుకుంటున్న ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. చేతి మీద లిమిటెడ్ ఎడిషన్ అనే డిజైన్‌తో పాటు.. కాలు మీద స్పానిష్ భాషలో కొటేషన్‌ను టాటూ వేయించుకుంది. టాటూ ఆర్టిస్ట్ తో పాటు చార్మీ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. Finally got inked 😁before I cud finish my 1st #tattoo ,I was ready for the 2nd one 😁 #addicted #feelingliberated #loveit ,over came my fear pic.twitter.com/cO7ADaxzhh — CHARMME KAUR (@Charmmeofficial) 19 June 2017 -
'డబ్బు లేకపోవడం వల్లే...'
పూరి జగన్నాథ్-నితిన్ సినిమా డబ్బు లేకపోవడం వల్లే ఆగిపోయిందని, తనవల్ల కాదని నటి చార్మి స్పష్టం చేసింది. అనవసరంగా తనను వివాదంలోకి లాగారని ఆమె వాపోయింది. ఈ సినిమా నిర్మాతలు అక్కినేని అఖిల్ మొదటి చిత్రానికి పెట్టుబడి పెట్టినందున పూరి జగన్నాథ్ తో సినిమా తీసేందుకు వెనుకడుగు వేశారని తెలిపింది. అందువల్లే పూరి జగన్నాథ్ మరో హీరో, నిర్మాతలతో ఈ సినిమా తీస్తున్నారని వెల్లడించింది. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని పేర్కొంది. మహిళను కాబట్టే తనను టార్గెట్ చేశారని చార్మి ఆవేదన వ్యక్తం చేసింది. కొంతమంది మగాళ్లు చాలా ఈజీగా మహిళలపై బురద చల్లుతుంటారని పేర్కొంది. ఇలాంటి వాళ్లు తమ అహంకారం వీడనాడి వాస్తవ పరిస్థితులను గమనించాలని సూచించింది. పురుషాధిక్య సినిమా పరిశ్రమలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని కోరింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో 'జ్యోతిలక్ష్మి' సినిమాను చార్మి నిర్మించిన సంగతి తెలిసిందే. -
ఈరోజు ఛార్మీ పెళ్లంట..
మహా...మహా ...మహా అంటూ ప్రేక్షకుల్ని 'మంత్ర'ముగ్ధుల్ని చేసిన హీరోయిన్ ఛార్మీ పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో మంగళవారం పోస్ట్ చేసింది. 'ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాను' అని ట్విట్ చేసింది. ఛార్మీ ఏప్రిల్ 4వ తేదీన కూడా ' ఓ యస్...ఐయామ్ ఇన్ లవ్' అంటూ ట్విట్ చేసింది. ఇంతకీ ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా...లేక సినిమాలో భాగంగా పెళ్లీ సీన్లో నటిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. కాగా 'నీ తోడు కావాలి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మీ... కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ ఆంజనేయం'తో ప్రేక్షకులకు చేరువైంది. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించింది. 'అనుకోకుండా ఓ రోజు, మంత్ర' చిత్రాలు ఛార్మీకి గుర్తింపు తెచ్చాయి. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన మంత్ర చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'జ్యోతిలక్ష్మి'చిత్రంలో నటిస్తోంది. Getting married today !! ❤️ pic.twitter.com/lc4Fvf1K3G — CHARMME KAUR (@Charmmeofficial) April 7, 2015