ఎక్సైజ్ కానిస్టేబుల్ పై చార్మీ ఫిర్యాదు
హైదరాబాద్ : ఎక్సైజ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌పై సినీనటి చార్మీ సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం విచారణకు సిట్ కార్యాలయానికి వచ్చిన తనపట్ల కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న చార్మీ విచారణ నిమిత్తం ఇవాళ అబ్కారీ కార్యాలయానికి వచ్చారు.
అప్పుడు లోనికి వెళ్లే సమయంలో మహిళా కానిస్టేబుల్స్ ఉన్నప్పటికీ తనను తాకుతూ శ్రీనివాస్ అత్యుత్సాహం ప్రదర్శించాడని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఘటనతో తాను ఒక్కసారిగా తాను షాక్‌కు గురైనట్లు చార్మి వెల్లడించినట్లు సమాచారం. మరోవైపు చార్మీని నలుగురు మహిళా అధికారుల బృందం ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందా, ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్ ఎలా పరిచయం అనేవాటిపై ప్రశ్నిస్తున్నారు.