
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ఆయన ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ తాజా షెడ్యూల్ ముంబైలో జరుగుతుంది. ఈ తరుణంలో ముంబైలోని రద్దీ రోడ్లపై పూరీని చూసి ఏమోషనల్ అయ్యాడు ఓ ఫ్యాన్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ముంబైలో ఇంటర్ చదువుతున్న ఓ తెలుగు కుర్రాడు కారులో వెళుతున్న పూరీతో మాట్లాడాడు. అతని పేరు ప్రమోద్ అని, మీకు పెద్ద ఫ్యాన్‌ని అంటూ ఆయనకి ఇంట్రడ్యూస్ చేసుకున్నాడు. కారుపై టీఎస్ నెంబర్ ప్లేట్ చూసి తెలుగు అనుకున్న కానీ డైరెక్టర్‌ని చూసి షాక్ అయినట్లు తెలిపాడు. సెల్ఫీ తీసుకోవాలను ఉందని, కానీ ఫోన్ లేకపోవడంతో కుదరట్లేదని ఎమోషనల్ అయ్యాడు. కారులో ఉన్న చార్మీ వీడియో తీస్తున్నట్లు గుర్తించి ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయండి మేడమ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. ఫోన్ లేకపోవడంతో సెల్పీ తీసుకోలేక పోయిన ఆ అభిమాని కోసం ఆమె సోషల్ మీడియాలో ఆ వీడియోని పోస్ట్ చేసింది. దీంతో ఇది ఇప్పుడు వైరల్‌గా మారింది.
చదవండి: ఆకాశ్‌లో ఆ కసి కనిపించింది
This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021
Comments
Please login to add a commentAdd a comment