ఈరోజు ఛార్మీ పెళ్లంట.. | actress charmee getting married today | Sakshi
Sakshi News home page

ఈరోజు ఛార్మీ పెళ్లంట..

Published Tue, Apr 7 2015 12:47 PM | Last Updated on Sat, Sep 2 2017 11:59 PM

actress charmee getting married today

మహా...మహా ...మహా అంటూ ప్రేక్షకుల్ని 'మంత్ర'ముగ్ధుల్ని చేసిన హీరోయిన్ ఛార్మీ పెళ్లి చేసుకోబోతుందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్లో మంగళవారం పోస్ట్ చేసింది. 'ఈ రోజు పెళ్లి చేసుకుంటున్నాను' అని ట్విట్ చేసింది. ఛార్మీ ఏప్రిల్ 4వ తేదీన కూడా  ' ఓ యస్...ఐయామ్ ఇన్ లవ్'  అంటూ ట్విట్ చేసింది. ఇంతకీ ఆమె నిజంగా పెళ్లి చేసుకుంటుందా...లేక సినిమాలో భాగంగా పెళ్లీ సీన్లో నటిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

కాగా 'నీ తోడు కావాలి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఛార్మీ... కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ ఆంజనేయం'తో ప్రేక్షకులకు చేరువైంది. అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించింది.  'అనుకోకుండా ఓ రోజు,  మంత్ర' చిత్రాలు ఛార్మీకి గుర్తింపు తెచ్చాయి. సస్పెన్స్, హారర్ ప్రధానాంశాలుగా తెరకెక్కిన మంత్ర చిత్రంలో ఛార్మి నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న 'జ్యోతిలక్ష్మి'చిత్రంలో నటిస్తోంది.


Getting married today !! ❤️ pic.twitter.com/lc4Fvf1K3G

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement