విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌ | drugs marfia case: Mumaith khan attend SIT investigation | Sakshi
Sakshi News home page

ముమైత్‌తో పాటు బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులు

Published Thu, Jul 27 2017 9:50 AM | Last Updated on Tue, Nov 6 2018 4:42 PM

విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌ - Sakshi

విచారణకు హాజరైన ముమైత్‌ ఖాన్‌

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి ముమైత్‌ ఖాన్‌ గురువారం సిట్‌ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ రోజు ఉదయం ఆమె శంషాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌ నుంచి నేరుగా నాంపల్లి అబ్కారీ కార్యాలయానికి వచ్చారు. ముమైత్‌ వెంట బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులు కూడా సిట్‌ కార్యాలయానికి వచ్చారు.

కాగా పూణెలో జరుగుతున్న బిగ్‌ బాస్‌ షో లో పాల్గొంటున్న ఆమె...షో నుంచి అనుమతి తీసుకుని బుధవారం రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ముమైత్‌ ఎయిర్‌పోర్టులో తనను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా ముఖానికి జర్కిన్ అడ్డుపెట్టుకొని మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయింది. కాగా సరైన చిరునామా దొరకకపోవడంతో సిట్‌ అధికారులు ఆమెకు ఆలస్యంగా  నోటీసులు ఇచ్చారు.

డ్రగ్స్‌ మాఫియా కేసులో నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు వరుసగా సిట్‌ ఎదుట విచారణకు హాజరు అవుతున్నారు. ముందుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, తరుణ్‌, నవదీప్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, చార్మీలను ప్రశ్నించిన సిట్‌... ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌తో గల సంబంధాలపై ఆరా తీసింది. శుక్రవారం హీరో రవితేజను సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement