రవితేజపై సిట్‌ ప్రశ్నల వర్షం! | drugs mafia case: SIT questions Hero Ravi Teja | Sakshi
Sakshi News home page

రవితేజపై సిట్‌ ప్రశ్నల వర్షం!

Published Fri, Jul 28 2017 1:35 PM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

రవితేజపై సిట్‌ ప్రశ్నల వర్షం! - Sakshi

రవితేజపై సిట్‌ ప్రశ్నల వర్షం!

హైదరాబాద్‌ : డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరైన హీరో రవితేజకు సిట్‌ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన నిందితుడు కెల్విన్‌, జీశాన్‌తో సంబంధాలపై ఆయనను అధికారులు ప్రశ్నిస్తున్నారు. గతంలో రవితేజ సోదరులు డ్రగ్స్‌ కేసులో పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై సిట్‌ అధికారులు ఆరా తీసినట్లు తెలుస్తోంది.

‘మీ సోదరులతో మీకు డ్రగ్స్‌ సంబంధాలు ఉన్నాయా?. కెల్విన్‌, జీశాన్‌ మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. కెల్విన్‌తో మీకు పనేంటి...ఏ పరిస్థితుల్లో అతడు పరిచయం అయ్యాడు?. షూటింగ్‌ లేని సమయాల్లో ఎక్కడ ఉంటారు. మీరు ఏయే పబ్బుల్లోకి ఎక్కువగా వెళతారు?. దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో మీకు ఎన్నేళ్లుగా పరిచయం?. మీ రక్త నమూనాలు తీసుకోవచ్చా?.’ అంటూ ప్రశ్నలు కురిపించినట్లు సమాచారం.

కాగా ఈ కేసులో నోటీసులు అందుకున్న రవితేజ శుక్రవారం ఉదయం విచారణ నిమిత్తం సిట్‌ అధికారుల ఎదుట హాజరైన విషయం తెలిసిందే.  ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన వ్యక్తులను కూడా సిట్‌ విచారణ చేసింది. ఈ కేసుల్లో నోటీసులు జారీ చేసిన వారిని వరుసగా సిట్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు. డ్రగ్స్‌ మాఫియా కేసులో ఇప్పటివరకూ సిట్‌ అధికారులు 19మందిని అరెస్ట్‌ చేశారు. కాగా మైక్‌ కమింగతో లింకులు ఉన్న మరో ఇద్దరి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement