అది నా ఫెవరెట్‌ సాంగ్‌.. కానీ.., : రష్మిక | Nitin Bheeshma Movie First Song Will Release On 27th December | Sakshi
Sakshi News home page

‘భీష్మ’ ఫస్ట్‌ సాంగ్‌ ఎప్పుడంటే..

Published Wed, Dec 25 2019 8:37 PM | Last Updated on Wed, Dec 25 2019 8:40 PM

Nitin Bheeshma Movie First Song Will Release On 27th December - Sakshi

నితిన్‌ హీరోగా ‘ఛలో’ ఫేమ్‌ వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘భీష్మ’. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్‌ గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా  క్రిస్మస్‌ను పురస్కరించుకొని తన అభిమానులకు ‘భీష్’మ అప్టేడ్‌ ఇచ్చాడు హీరో నితిన్‌. ఈ సినిమాలోని మొదటి పాటను డిసెంబర్‌ 27న విడుదలవుతుందని చెప్పాడు.

ఈ మేరకు హీరోయిన్‌ రష్మికతో కలిసి ఓ వీడియో తీసి ట్విట్‌ చేశారు. ఇది కేవ‌లం పాట మాత్ర‌మే కాదు.. తమ గీతం అని చెప్పాడు. అది తన ఫెవరెట్‌ సాంగ్‌ అని రష్మిక చెప్పింది. ఆ పాటలో తనను ఎందుకు పెట్టుకోలేదని డైరెక్టర్‌ వెంకీ, నితిన్‌తో గొడవ దిగింది కూడా. మరి రష్మిక ఫెవరెట్‌ సాంగ్‌ వినాలంటే ఇంకో రెండు రోజులు(డిసెంబర్‌ 27)వరకు ఆగాల్సిందే.

రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి స్వర సాగర్‌ సంగీతమందిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్‌ ప్లాన్ చేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement