తమిళసినిమా: అన్నాదురై చిత్రానికి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎలాంటి ఆక్షేపణ రాలేదని ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని తెలిపారు. ఈయనకు జంటగా డయానా సంబిక నటించిన ఈ చిత్రాన్ని నటి రాధికాశరత్‌కుమార్ ఆర్.స్టూడియోస్, ఫాతిమా విజయ్‌అంటోని, విజయ్‌ఆంటోని ఫిలిం కార్పొరేషన్ సంస్థలు కలిసి నిర్మించారు. నవ దర్శకుడు శ్రీనివాసన్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పిక్చర్ బాక్స్ కంపెనీ అధినేత అలెగ్జాండర్ తమిళనాడు హక్కులను కొనుగోలు చేసి గురువారం 400 థియేటర్లలో విడుదల చేశారు. విజయ్‌ఆంటోని చిత్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదలైన చిత్రం ఇదే అవుతుందని ఆయన గురువారం చెన్నైలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అనంతరం చిత్ర కథానాయకుడు విజయ్‌ఆంటోని మాట్లాడుతూ రాధిక నిర్మాతగా తాను నటుడిగా చిత్రం చేస్తామని ఊహించలేదన్నారు.
ఒక మంచి కథా చిత్రానికి పాటలు అవసరం లేదని ఆయన అన్నారు. అదే విధంగా మునుపటి మాదిరి ఇప్పుడు ఆడియోకు ఆదాయం రావడం లేదని పేర్కొన్నారు.అందుకు ఈ చిత్ర పాటలను తన వెబ్‌సైట్ ద్వారా ఫ్రీగా డౌన్‌టోడ్ చేసుకోనేలా వసతి కల్పించానని తెలిపారు. అన్నాదురై చాలా పాపులర్ పేరు అని ఆ పేరును చిత్రానికి పెట్టడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తలేదా?అని అడుగుతున్నారని, ఇందులో తాను ద్విపాత్రాభినయం చేశానని చెప్పారు.అన్న పాత్ర పేరు అన్నాదురై, తమ్ముడి పాత్రపేరు తంబిదురై అని తెలిపారు. అయితే సెన్సార్ సభ్యులు ఈ పేరు గురించి అడిగారని, అందుకు తగిన వివరణ ఇవ్వడంతో వారు సంతృప్తి చెందారని అన్నారు.అయితే ఇప్పటి వరకూ ఏ రాజ కీయ పార్టీ ఈ టైటిల్‌కు ఆక్షేపణ తెలపలేదని విజయ్‌ఆంటోని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment